దొంగ‌ల్లో ర‌క‌ర‌కాల దొంగ‌లు ఉంటారు... కొంద‌రు చిల్ల‌ర దొంగ‌లు ఉంటే.. మ‌రి కొంద‌రు భారీ టార్గెట్లు పెట్టుకుని దొంగ‌త‌నాలు చేసే వారు ఉంటే.. మ‌రి కొంద‌రు ఏకంగా పెద్ద పెద్ద నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌ల‌నే టార్గెట్‌గా చేసుకుని దొంగ‌త‌నాలు చేస్తూ ఉంటారు. ఓ మంత్రి ఫోన్ కొట్టేయాలంటే ఆ దొంగ‌కు ఎంత చాక‌చ‌క్యం ఉండాలి చెప్పండి... మంత్రి అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది.. చుట్టూ ఎంత మంది మ‌నుష్యులు ఉంటారు... ఎంత హ‌డావిడి ఉంటుంది.. మ‌రి వీరంద‌రిని కాద‌ని స‌ద‌రు దొంగ ఏకంగా మంత్రి ఫోన్ కొట్టేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

 

ఏపీ మంత్రికి చెందిన ఫోన్‌ను ఓ దొంగ కొట్టేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది. ఏపీ రాష్ట్ర స‌మాచార‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి పేర్ని నాని సెల్ ఫోన్‌ను ఓ దొంగ కొట్టేశారు. మంత్రి నాని బుధ‌వారం స‌చివాల‌యంలో పలు స‌మావేశాల్లో పాల్గొన్నారు. ఈ స‌మీక్ష‌ల్లో ఆయ‌న రోజంతా ఎంతో బిజీ బిజీగా గ‌డిపారు. ముందుగా నాని ఆర్థిక శాఖ స‌మీక్ష‌కు హాజ‌రైన త‌ర్వాత అక్క‌డ త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన సంద‌ర్శ‌కుల‌తో భేటీ అయ్యారు. అక్క‌డ వారి నుంచి ప‌లు విన‌తులు, విజ్ఞ‌ప్తులు స్వీక‌రించారు.

 

అనంత‌రం స‌చివాల‌యంలో వివి ధ స‌మీక్ష‌ల్లో పాల్గొన్నారు. మ‌ధ్యాహ్నం ఆయ‌న క్యాంటిన్‌లోనే భోజ‌నం చేశారు. అనంత‌రం ఆయ‌న ఫోన్ చూసుకుంటే లేదు. అక్క‌డ వెత‌క‌గా ఆయ‌న ఫోన్ క‌నిపించ‌లేదు. చివ‌ర‌కు ఫోన్ ఎవ‌రో కొట్టేశార‌న్న విష‌యం తెలిసింది. వెంట‌నే అలెర్ట్ అయిన మంత్రి అనుచ‌రులు, స‌చివాల‌య భ‌ద్ర‌తా సిబ్బంది ఫోన్ ఎక్క‌వ ఉంద‌న్న విష‌యం ఎంక్వైరీ చేయ‌గా.. అప్ప‌టికే ఫోన్ రాష్ట్రం దాటిపోయిన‌ట్టు గుర్తించారు.

 

వీళ్లు ఎంక్వైరీ చేసే టైంకే ఫోన్ తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్గగొండ జిల్లాలో ఉన్న‌ట్టు సిగ్న‌ల్స్ లొకేషన్ ద్వారా ట్రేస్ చేశారు. అయితే ఈ ఫోన్ ఎలా పోయింది ?  ఎవ‌రు దొంగిలించారు ? అన్న దానిపై పోలీసులు సీరియ‌స్‌గా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: