చేపల వ్యాపారి హత్య కేసు ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చేపల వ్యాపారి రమేశ్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. రమేశ్‌కు మూడు రోజుల కిందట అరుణ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్ కాల్ తో అతను బయటకు వచ్చారని సమాచారం.  

 

అప్పటి నుండి కనిపించకుండా రమేష్ పోయాడు. కిడ్నాప్‌కు గురైన మరుసటి రోజు రమేశ్ మొబైల్ నుంచి దుండగులు అతడి మేనకోడలు ఫోన్‌కు సందేశం పంపించినట్లు రమేశ్ సోదరుడు తెలిపాడు. తక్షణం రూ.కోటి ఇవ్వాలని, లేదంటే రమేశ్‌ను చంపేస్తామని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించినట్లు చెప్పారు. రమేశ్ గురించి గాలిస్తు్న్న కుటుంబసభ్యులు అతడు కిడ్నాప్‌కు గురైనట్లు తెలిసిన వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు.

 

ఆదివారం మధ్యాహ్నం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఓ మహిళ, పిల్లాడితో అద్దెకు దిగినట్లు చెప్పాడు. ఆ మహిళను తన భార్యగా పరిచయం చేసినట్లు వెల్లడించాడు. రమేశ్‌ను పక్కా ప్రణాళిక ప్రకారం.. గదికి పిలిపించి హత్య చేసినట్లు గుర్తించారు.జనవరి 21న రమేశ్‌కు ఫోన్‌ చేసి.. తన వద్ద ఒక అమ్మాయి ఉందంటూ ఒక ఫొటో పంపాడు. తన గదికి రావాలని పిలిచాడు.

 

రమేశ్‌ అక్కడకు వెళ్లగా అమ్మాయిలు కనిపించలేదు. దీంతో గది బయటి నుంచే ఆయన వెళ్లిపోయారు. దీంతో రాజు నాయక్‌ ఈ నెల 1న మరో అమ్మాయి ఫోటోను వాట్సాప్‌ చేశాడు.అంతే అక్కడకు చేరుకున్న అతన్నీ కిడ్నాప్ చేసి అతని ఫోన్ నుండే కోటి రూపాయలు కావాలని కోరారు. అయితే చంపేసి అతని బాడీని ముక్కలు కోసి ఓ గదిలో బంధించారు. దుర్వాసన రావడంతో స్థానికులు గ్రామస్తులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు టాక్స్ ఫోర్స్ వచ్చి దర్యాప్తు చేసి రమేష్ మృతదేహంగా గుర్తించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: