ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అడ్డు అదుపు లేకుండా జగన్ వ్యవహరిస్తూ పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తన ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని జగన్ చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు, ఎనిమిది నెలల కాలంలోనే ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసి దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును జగన్ సృష్టించగలిగారు. ప్రతి శాఖలోనూ పారదర్శకత పెంచేలా వ్యవహరిస్తూ... ప్రతి పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసారు. అంతే కాకుండా పార్టీలకు అతీతంగా జగన్ సంక్షేమ పథకాలు అందించడంపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.


 గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు వారి ఇంటి వద్ద కే సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల తో పాటు పోలీస్ శాఖకు అన్నివిధాల సేవలందిస్తున్న హోంగార్డులు, లారీ, బస్సు, ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారు ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే వారికి భీమా ప్రీమియం చెల్లించేలా ఈ పథకాన్ని జగన్ తీసుకువచ్చారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది. అలాగే గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు కార్మికశాఖ అధికారులు తెలియజేసారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసున్న వారు దీనికి అర్హులుగా కార్మిక శాఖ ప్రకటించింది.


 ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ప్రభుత్వం తరఫున 5 లక్షలు సహాయం ఈ పథకం ద్వారా అందిస్తామని కార్మిక శాఖ తెలిపింది. కొత్తగా ఈ పథకం అమలులోకి తీసుకు రావడంపై జర్నలిస్ట్, ఆటో, లారీ, బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ లు ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఎన్నో భారీ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. అంతే కాకుండా పాఠశాల్లో విద్యార్థులకు వడ్డించే భోజనంలో కొత్త కొత్త ఐటమ్స్ చేర్చింది. ఇప్పుడు ఈ భీమా పథకం ద్వారా మరింతగా ప్రజాదరణ జగన్ పొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: