ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండే మీడియా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల వార్తలు ప్రసారం చేయడం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో అమరావతి గురించి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడటంతో ఆ విషయం లో వైసీపీ పార్టీకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత మీడియా రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్లి పోతున్నట్లు ప్రసారం చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

కియా మోటార్స్‌ అనంతపురం జిల్లా నుండి వెళ్లి పోతున్నట్లు తమిళనాడు రాష్ట్రానికి తరలి పోతున్నట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ప్రసారం చేస్తున్నాయి అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ విషయంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇది చంద్రబాబు కావాలని కుట్రపూరిత ఆలోచన అని తన వర్గం మీడియా చేత ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.  కియా మోటార్స్ విషయంలో మొట్ట మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని తమిళనాడుకి వెళ్లే తరుణంలో.. దానిని ఏపీకి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.

 

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆద్వర్యంలో కియా మోటార్స్ ఎక్కడికో తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కియాకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని.. భవిష్యత్తులో మరో ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. కియా మోటార్స్ గురించి పార్లమెంట్ లోపలా, బయటా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దుష్ప్రచారానికి ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని కియా మోటార్స్ విషయంలో వస్తున్న వార్త అవాస్తవమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: