ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలనే ఉత్సాహంతో కొంతమంది ప్రజా బలం లేని నాయకులు రకరకాలుగా తమ రాజకీయ ప్రత్యర్ధులను విమర్శిస్తూ... పనిలో పనిగా ప్రభుత్వ అధికార అధికారులను నిందిస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వరుసలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ప్రజా బలం లేని నాయకులు ఇటువంటి వ్యవహారాల్లో కొంతమంది టిడిపి నాయకులు ముందు వరుసలో ఉన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ పెద్ద దుమారం రేగుతోంది. 

 

ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ వర్ల రామయ్య పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసు అధికారుల సంఘం పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో హౌసింగ్ చైర్మన్ గా పనిచేసిన వర్ల రామయ్య పోలీస్ హౌసింగ్ ఫ్లాట్ సమస్య ఎందుకు పరిష్కరించ లేకపోయారో సమాధానం చెప్పాలి అంటూ ఆయన ప్రశ్నించారు. మొన్నటి వరకు ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన పోలీసులకు కనీసం బస్సు పాస్ కూడా ఇప్పించలేకపోయారు అంటూ మండిపడ్డారు. ఇప్పుడు అనవసరంగా పోలీసుల గురించి మాట్లాడుతూ తమ మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు రామయ్య మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏంటి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, అలా కాకుండా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే తామేంటో చుపిస్తామన్నారు. అయినా ఒక పోలీసు అధికారిగా పనిచేసిన వర్ల రామయ్య పోలీసుల గురించి ఇంత దిగజారి మాట్లాడ్డానికి సిగ్గులేదా అంటూ మండిపడ్డారు. 


ఇంతకీ పోలీసు అధికారుల సంఘం ఈ స్థాయిలో వర్ల రామయ్య మీద మండిపడడానికి కారణం బుధవారం రామయ్య మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సంద్రాభంగా వర్ల రామయ్యపోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమ కారులను నిలువరించేందుకు పోలీసులు గోళ్ళతో రక్కుతూ ..రాజధాని పోలీస్ స్టేషన్ లు అన్నిటిని మహిళతో నింపేసి వారిని లాఠీలతో కొట్టినా ఉద్యమం ఆగలేదు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: