చెన్నైలో మాయగాళ్ళు తీరే వేరు.. తమది కాని హోటల్ ని దర్జాగా 165 కోట్లుకు అమ్మకానికి బేరం కుదుర్చుకున్నారు.  ఒక్క క్షణం ఆగితే చేతిలో పడే పదిశాతం కమీషన్ తో చెక్కేద్దామనుకున్నారు...తీరా సీన్ కట్ చేస్తే..!

 

 చెన్నైలోని ఫేమస్ స్టార్ హోటల్ అంబికా ఎంపైర్.. ఆ హోటల్ అమ్మకానికి  వచ్చింది..కేరళకు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కొనాలని ముందుకు వచ్చింది. హోటల్ లాబీల్లోనే హోటల్ ప్రతినిధులు వీరితో డీల్ మాట్లాడుతున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి హోటల్ ప్రతినిధులు ముగ్గుర్ని తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ కు పట్టుకుపోయారు .. అసలు స్టోరీ తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఏకంగా ఒక త్రీస్టార్ హోటల్ నే అమ్మకానికి పెట్టేశారు. అదే హోటల్లో కూర్చుని వేరే కంపెనీతో బేరాలు మాట్లాడారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 165కోట్లకు ఆ హోటల్ అమ్మేసేందుకు డీల్ మాట్లాడేశారు. అక్కడే పోలీసులు రంగప్రవేశం చేశారు. 

 

విషయమేమంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లైన ముగ్గురు మాయగాళ్లు వడపళనిలోని కేరళకు చెందిన త్రీస్టార్ హోటల్ అంబికా ఎంపైర్ ను అమ్మేసే ప్రయత్నం చేశారు. నిందితులు ముగ్గురూ కేరళలోని  తిరువనంతపురంకు చెందిన పాలక్కల్ హోమ్ సొల్యూషన్స్ తో డీల్ కుదుర్చుకున్నారు. ఇలాగే తమిళనాడు, కేరళలోని అనేక బడా కంపెనీలకు ఈ బ్రోకర్లు లేఖలు పంపారు. డీల్ బాగుండటంతో ఆ సంస్థ ప్రతినిధులు హోటల్ కొనేందుకు చెన్నైకు వచ్చారు. వారికి నమ్మకం కలిగించేందుకు అంబికా హోటల్లోనే కంపెనీ ప్రతినిధులకు రూమ్ లు తీశారు. అక్కడే లాబీల్లో కూర్చుని తమని పరిచయం చేసుకున్నారు.హోటల్ యజమాని అప్పుల్లో ఉండడం వల్ల తక్కువ రేటుకు అమ్ముతున్నారంటూ ఫేక్ డాక్యుమెంట్లు కూడా చూపించారు. పైపెచ్చు ఆ ముగ్గురులో ఒకరు హోటల్ జనరల్ మేనేజర్ గాను, ఇంకొకరు ఆడిటర్ గాను మరొకరు మేనేజర్ గా పరిచయం చేసుకున్నారు. 

 

ఒప్పందం ప్రకారం 165కోట్లలో పదిశాతం చెల్లించాలని కండిషన్ పెట్టారు. అంతవరకూ అంతా బాగానే నడిచింది.  కేరళ నుంచి వచ్చిన పాలక్కల్ కంపెనీ ప్రతినిధులు అంతా నిజమే అనుకున్నారు. ఇంతలోనే ఈ డీల్ వ్యవహారమంతా అక్కడ పని చేస్తున్న సిబ్బంది విన్నారు. ఎక్కడో డౌట్ వచ్చి విషయం అసలు మేనేజర్ కు చెప్పారు. అదే సమయంలో హోటల్ యజమాని సుదర్శన్ కూడా హోటల్లో ఉన్నారు. వెంటనే వారంతా అప్రమత్తమై వారిని నిలదీయడంతో ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేస్తే సిబ్బంది అంతా కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

 

నిందితుల్లో పరమానందమ్, కరుణాకరన్, దక్షిణామూర్తి ముగ్గురూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లని..ఈజీ మనీ కోసం ఇలా అందరినీ మోసం చేస్తారని పోలీసులు చెబుతున్నారు. గతంలోనూ అనేక విలువైన స్టార్ హోటళ్లు, ఇతర భవనాలను అమ్మేస్తున్నామంటూ జనాలను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. ఈ మాయగాళ్ల మాయజాలానికి  చెన్నై పోలీసులే షాక్ తిన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: