హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ పట్టుబడ్డారు. అధికారులు ఐదు నెలలుగా గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ డాక్టర్ ముంబాయి నుండి వచ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగులు ఆస్పత్రిలో కనీస భద్రత కూడా లేదని చెబుతున్నారు. గాంధీ అస్పత్రి సిబ్బంది నకిలీ డాక్టర్ ను పట్టుకొని పూర్తి విచారణ జరిపిన తరువాతే పోలీసులకు అప్పగించామని చెబుతున్నారు. 
 
గత ఐదు నెలల నుండి ఫేక్ డాక్టర్ విధుల్లో ఉన్నా సిబ్బంది ఎవరూ గుర్తించలేకపోవడం గమనార్హం. గాంధీ ఆస్పత్రిలో ఒక్కో విభాగంలో ఒక్కో మాట చెబుతూ ఫేక్ డాక్టర్ ఇక్కడ వైద్యం చేశాడని వైద్యులు చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో పని చేసే అందరికీ ఐడీ కార్డులు ఉన్నాయని అతని దగ్గర కూడా ఐడీ కార్డు ఉందని అతని దగ్గర ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐడీ కార్డు ఉండటంతో నిజంగానే ఆ సంస్థ తరపున వచ్చాడేమో అని తాము అనుకున్నామని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. 
 
ఒక డిపార్టుమెంట్ లో వైద్యులకు అనుమానం రావడంతో విచారణ చేయగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారని ఆ విధంగానే నిబంధనలు ఉన్నాయని ఇకనుండి ఐడీ కార్డుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నామని చెప్పారు. ఇలాంటి ఫేక్ డాక్టర్లను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామని ఇక్కడి డాక్టర్లు చెబుతున్నారు. 
 
ఫేక్ డాక్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణ తరువాత పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు గాంధీ ఆస్పత్రిలో తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం కూడా గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ల గురించి వార్తలు వచ్చాయి. ఒక అపరిచితురాలు డాక్టర్ వేషంలో వచ్చి మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన అప్పట్లో సంచనలం అయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: