ఒకప్పుడు తెలుగు సినిమాలంటే ఎన్నో విలువలతో కూడినవిగా  ఉండేది. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలు విలువలకు చాలా దూరం అయ్యాయి అనే చెప్పాలి. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద హీరోల సినిమాలు తప్పితే.... మిగతా సినిమాలన్నీ బూతు కథ సినిమా లే  ఉంటున్నాయి. ఒకప్పుడు బూతు సినిమాలకు కిలోమీటర్ల దూరంలో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను మించి పోయింది అని చెప్పాలి. బాలీవుడ్ ఏంటి హాలీవుడ్ సినిమాలను కూడా మించి పోతుంది. కొంతమంది దర్శకులు అయితే బూతు సినిమాలు తీయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్నో  బూతుసినిమాలు వచ్చినప్పటికీ అందులో ఒకటో రెండో మాత్రమే తెరమీదికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి . 

 

 

 మిగతా అన్ని బూతు సినిమాలు కనిపించకుండా పోతున్నాయి. పడక గదిలో నలుగురు మధ్య జరిగే ప్రక్రియలను కెమెరా ముందు పదిమందికి చూపించేలా ఉంటున్నాయి బూత్ సినిమాలు. కొంతమంది అయితే ఇలాంటి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన చిత్రమే డిగ్రీ కాలేజ్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ని చూస్తే న భూతో న భవిష్యత్ అన్నట్లుగా ఉంది.మొత్తం  అలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. సినిమా చూసినంత సేపు యువతను మొత్తం బూతులో  ముంచెత్తుతుంది. అయితే ఇలాంటి సినిమాలకు సంబంధించిన పోస్టర్లు  బహిరంగ ప్రదేశాల్లో  పబ్లిక్ ప్లేస్ కనిపిస్తే అది పబ్లిక్కు ఎంతగానో ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బూతు పోస్టర్ల పంచాయతీ   ఏకంగా పోలీస్ స్టేషన్  వరకు వెళ్ళింది. 

 

 

 బూత్ కంటెంట్ తో  వస్తున్న సినిమాల పోస్టర్లు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో అతికిస్తే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక తాజాగా డిగ్రీ కాలేజీ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఎస్ఆర్ నగర్ లోని మైత్రివనం కూడలిలో దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పోలీసులు డిగ్రీ కాలేజీ సినిమా దర్శకుడు  నిర్మాత పై కేసులు నమోదు చేశారు పోలీసు.ఈ సినిమా దర్శకుడు నరసింహ నంది నిర్మాత శ్రీనివాస్ రావు ను అదుపులోకి తీసుకున్నారు ఎస్.ఆర్.నగర్ పోలీసులు. ఇక ఈ సినిమా శ్రీ లక్ష్మీనరసింహ బ్యానర్ పై  వరుణ్.. దివ్య రావు హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్న సమయంలో  చిత్రానికి  పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మరి ఇప్పుడు సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: