ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హాజీపూర్ సైకో శ్రీనివాస్‌రెడ్డికి మైన‌ర్ల రేప్‌, హ‌త్య కేసులో ఎట్ట‌కేల‌కు ఉరిశిక్ష ప‌డింది. న‌ల్ల‌గొండ జిల్లాలో ప్ర‌త్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేవ‌లం 90 రోజుల్లోనే విచార‌ణ పూర్తి చేసి ఉరి శిక్ష విధించ‌డంతో న‌ల్ల‌గొండ జిల్లా వాసులు హ‌ర్షాతీరేకాలు వ్య‌క్తం చేశారు. ఇక హాజీపూర్ గ్రామంలో ప్ర‌తి ఒక్క‌రు మిఠాయిలు పంచుకుని సంబ‌రాలు చేసుకుంటున్నారు. మృతుల కుటుంబాల‌కు చెందిన వారు అయితే త‌మ పిల‌ల ఆత్మ‌కు శాంతి క‌లిగింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 

ఇక ఈ ఉరిశిక్ష వెన‌క శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిల‌పై భ‌యంక‌రంగా రేప్ చేసి హ‌త్య చేసి వాళ్ల ఆన‌వాళ్లు కూడా లేకుండా చేశాడు. ఈ ముగ్గురు అమ్మాయిల్లో ముందుగా శ్రావ‌ణి అనే అమ్మాయి మిస్సింగ్ అయ్యింది. ఆమె గురించి కుటుంబ స‌భ్యులు చాలాసార్లు వెతికారు.. గ్రామ శివ‌ర్ల‌లో శ్రీనివాస్‌రెడ్డి వ్య‌వ‌సాయ బావిలో శ్రావ‌ణి మృత‌దేహం క‌నిపించింది. ఇక అదే గ్రామానికి చెందిన మ‌నీషా అంత‌కు ముందే మిస్ అయ్యింది. మ‌నీషా డిగ్రీ చ‌దువుతూ మిస్సింగ్ అవ్వ‌గా... అప్ప‌టికే ఆమె ప్రేమలో ఉంది.

 

దీంతో ఇంట్లో వాళ్లు ప్రేమ వివాహం నేప‌థ్యంలోనే ఇళ్లు విడిచి వెళ్లింద‌ని అనుకున్నారు. అయితే అక్క‌డే మ‌నీషా ఐడీ కార్డు దొరికింది.. ప‌క్క‌నే ఆమె మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఇక ఈ క్ర‌మంలోనే 2015లో అదృశ్య‌మైన క‌ల్ప‌న కేసు తెర‌మీద‌కు వ‌చ్చింది. క‌ల్ప‌న‌ను కూడా శ్రీనివాస్‌రెడ్డి రేప్ చేసి చంపేశాడ‌ని విచార‌ణ‌లో వెల్ల‌డైంది. క‌ల్ప‌న ఐదో త‌ర‌గ‌తి చ‌దివే మైన‌ర్‌. ఆమెకు కూడా లిఫ్ట్ ఇస్తాన‌ని బైక్ ఎక్కించుకుని త‌న పొలంలోకి తీసుకు వెళ్లి అత్యంత కిరాత‌కంగా రేప్ చేసి చంపేశాడు.

 

శ్రీనివాస్‌రెడ్డి ఈ రేప్‌లు చేయ‌డం వెన‌క ఫోన్లో బ్లూ ఫిల్మ్‌లు చూసి.. వాటి ప్రేర‌ణ‌తోనే ఇలా చేశాడ‌ని తేలింది. ఇక ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష ప‌డ‌డంతో హాజీపూర్ గ్రామ‌స్తుల ఆనందానికి అవ‌ధులే లేవు. ప్ర‌తి ఒక్క‌రు రోడ్ల మీద‌కు వ‌చ్చి సంబ‌రాలు చేసుకోవ‌డంతో పాటు అత‌డికి ఉరి శిక్ష వెంట‌నే అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: