ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లే కథనాలు, తప్పుడు వార్తలు రాస్తే యాక్షన్ తీసుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2430 జీవోను తెచ్చింది. తాజాగా అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కియా కార్ల తయారీ ప్లాంటు తమిళనాడుకు తరలిపోతున్నట్లు  కథనాలు సంచలనంగా మారింది. ప్రముఖ మీడియా సంస్ధ రాయటర్స్ లోనే కియా మోటారు ప్లాంటు కథనం రావటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఈ కథనం మొత్తం చూస్తే తెరవెనుక నుండి ఎవరో కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే కథనాన్ని రాయించినట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది. ఇదే విషయాన్ని కియా యాజమాన్యం కూడా అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం. అనంతపురం జిల్లా నుండి తమ ఉత్పత్తి ప్లాంటు తమిళనాడుకు తరలిపోతోందనే కథనాలు రాయించాల్సిన అవసరం ఎవరికుంది ?

 

తమ ప్లాంటు తరలింపు విషయంలో వచ్చిన కథనాలను కంపెనీ యాజమాన్యంతో పాటు  ప్రభుత్వం కూడా ఖండించింది.  జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోమీడియా ఉద్దేశ్యపూర్వకంగా బురద చల్లుతున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇటువంటి బురద చల్లే కథనాలు, వార్తలు రాసిన మీడియాపై చర్యలు తీసుకునేందుకే జగన్ ప్రభుత్వం 2430 జీవోను తెచ్చింది.  ఈ జీవోపై చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా ఎంతగా రాద్దాంతం చేసింది అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

తప్పుడు వార్తలు, బురద చల్లే కథనాలు రాసిన వాళ్ళపై చర్యలు తీసుకుంటామని జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే వ్యతిరేక వార్తలు, కథనాలు రాయనీయకుండా జగన్ ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరిస్తోందంటూ ఎల్లోమీడియా మళ్ళీ ఒకటే ఊదరగొడుతోంది. వీళ్ళకు వత్తాసుగా చంద్రబాబు కూడా దేశమంతా తిరిగి నానా యాగీ చేశారు. తాజాగా ప్రభుత్వంతో పాటు కియా కంపెనీపై బురద చల్లే కథనాలు రాసినందుకు జర్నలిస్టులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: