టీడీపీకి షాక్...టీడీపీకి భారీ షాక్...టీడీపీకి ఝలక్..టీడీపీకి గుడ్ బై...ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీని వీడుతున్న నేతల కోసం బోలెడు డైలాగులు చెప్పొచ్చు. అసలు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి టీడీపీకి ఈ డైలాగులే బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతూ వచ్చాయి. ఆ పార్టీ ఘోర ఓటమి దెబ్బకు సీనియర్ల నుంచి జూనియర్ల వరకు చాలామంది నేతలు తట్టా బుట్టా సర్దేసుకుని టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. మొదట్లో కొందరు బీజేపీలోకి పోతే..మరికొందరు వైసీపీలోకి వెళ్లారు.

 

అయితే ప్రస్తుతానికి ఆ వలసలు కాస్త ఆగినా... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు మాత్రం భారీ షాకులే తగలోచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో సీనియర్ నేత ఫ్యామిలీ కూడా షాక్ ఇచ్చేయోచ్చని తెలుస్తోంది. మొన్న 2019 ఎన్నికల్లో చీరాల నుంచి భారీ మెజారిటీతో గెలిచిన కరణం బలరాం...ఫ్యామిలీ ఎప్పటి నుంచో వైసీపీలోకి వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందుగానీ, తర్వాతగానీ ప్రచారం పీక్స్‌లో నడిచింది.

 

కానీ ఎంత ప్రచారం జరిగిన కరణం ఫ్యామిలీ ఇంకా టీడీపీని వీడలేదు. వీడేందుకు ప్రయత్నాలు చేసిన, వైసీపీ నుంచి సరైన హామీలు దక్కక వెనుకడుగు వేసినట్లు తెలిసింది. కాకపోతే ఈసారి మాత్రం కరణం ఫ్యామిలీ జెండా లేపేయడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలంటే కరణం అండ కావాల్సిందే అనే ప్రచారం నడుస్తుంది.

 

కరణం ఫ్యామిలీకు చీరాలలోనే కాకుండా అద్దంకి, పర్చూరు, దర్శి, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. కాబట్టి కరణం ఫ్యామిలీ వస్తే ఇంకాస్త వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తనకు చీరాల టికెట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు మున్సిపాలిటీ మేయర్ పదవిని తన కుమారుడికి ఇవ్వాలని కరణం ఇదివరకే కండిషన్ పెట్టినట్టు తెలిసింది. అప్పటిలో ఈ కండిషన్‌పై కాస్త ఆలోచన చేసిన వైసీపీ అధిష్టానం...ఇప్పుడు సుముఖంగా ఉందని సమాచారం. దీంతో కరణం ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తుందని తెలిసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: