ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి...జగన్ కేబినెట్‌లో అతి చిన్న వయసు గల మంత్రి. 25 ఏళ్ల వయసులోనే విజయనగరం కురుపాం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన నాయకురాలు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. దాంతోనే 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి...ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. అయితే ఈ విధంగా అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో రాణిస్తున్న పుష్పశ్రీ..వైసీపీలో కీలక పాత్ర పోషిస్తుంటే..ఆమె ఫ్యామిలీ మాత్రం టీడీపీలో ఉంటూ కష్టాలు పడుతుంది.

 

ఇక అలా ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు పుష్పశ్రీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పుష్పశ్రీ భర్త అయిన పరిక్షిత్ రాజు తండ్రి శతృచర్ల చంద్రశేఖర్ రాజు టీడీపీలో ఉన్నారు. ఇక చంద్రశేఖర్ అన్నయ్య.. శతృచర్ల విజయరామరాజు అనే సంగతి తెలిసిందే. విజయరామరాజు....ఏపీ రాజకీయాల్లో దిగ్గజ నేత. కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక ఈయన మేనల్లుడు జనార్ధన్ దాట్రాజ్.

 

2014, 2019 ఎన్నికల్లో జనార్ధన్ టీడీపీ నుంచి పోటీ చేసి, పుష్పశ్రీపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి జనార్ధన్ పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. అటు చంద్రశేఖర్ ఎప్పుడో సైలెంట్ అయిపోయారు. ఇక విజయరామరాజు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నా...పెద్దగా పార్టీలో కనపడటం లేదు. మొన్న శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులు వచ్చిన నేపథ్యంలో ఈయన మండలికి హాజరు కాలేదు.

 

మూడు రాజధానుల వల్ల వైజాగ్ పక్కనే ఉండే. విజయనగరం కూడా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో శతృచర్ల టీడీపీ ఊసే ఎత్తడం లేదు. పైగా టీడీపీ మూడు రాజధానులకు అడ్డుపడటం కూడా శతృచర్లకి సొంత జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ కోడలు పిల్ల అయిన పుష్పశ్రీ ద్వారా ఫ్యామిలీ మొత్తం వైసీపీలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అటు పుష్పశ్రీ కూడా తన ఫ్యామిలీని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. దాంతో త్వరలోనే పుష్పశ్రీ ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: