రెండు వేర్వేరు కేసుల్లో.. ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితులకు ఉరి శిక్షలు విధిస్తూ కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి. నెల్లూరు జిల్లా హరినాథపురంలో  తల్లి, కూతురు హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనపు కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. 2013 ఫిబ్రవరి 12వ తేదీన మెడికో భార్గవి ఆమె తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. కాగా తండ్రి తండ్రి దినకరన్ రెడ్డి పై హత్యాయత్నం చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులపై కేసులు నమోదయ్యాయి. అనేక హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇంతియాజ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండగా మిగతా ఇద్దరు మైనర్లు. 


ఇప్పటికే వీరు మూడేళ్ల శిక్ష అనుభవించారు. నగరంలోని వాగ్దేవి ఫార్మసి కళాశాల కరస్పాండెంట్ దినకర్ రెడ్డి స్థానిక హరనాథపురంలో భార్య, కుమార్తె నివాసముంటున్నారు. కుమార్తె భార్గవి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. హరినాథపురం లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ఎలివేషన్ ప్లాన్ తయారు చేసేందుకు దినకర్ రెడ్డి ఒకరిని కలిసారు.

 

దినకరన్ రెడ్డి 2013 ఫిబ్రవరి 12న రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవి ఇంటి దగ్గరే ఉన్న సమయంలో ఇంతియాజ్ మరో ఇద్దరితో కలిసి ఎలివేషన్ డిజైనింగ్ కోసం వచ్చామని చెప్పారు. కానీ ఇంట్లో వారిని బెదిరించి నగల దోచుకునేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న తల్లి, కూతురును ఆ సమయంల హత్య చేసినట్లుగా వీరిపై కేసులు నమోదయ్యాయి.


 ఇక తెలంగాణలోని హాజీపూర్ కేసు విషయానికి వస్తే తెలంగాణలోని హాజీపూర్ హత్య కేసులో హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కి ఉరి శిక్ష ఖరారు అయింది. మొత్తం మూడు కేసులకు గాను రెండు కేసుల్లో ఉరిశిక్ష విధిస్తూ.. ఓ కేసులో జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి తీర్పు చెప్పారు. న్యాయస్థానం విధించిన ఈ మూడు శిక్షలను  ఏక కాలంలో అమలు చేయాలని జడ్జి ఆదేశాలు ఇచ్చారు.

 

ఈ కేసులోమొత్తం 300 మంది సాక్షులను విచారించగా 101 మంది సాక్షుల వాంగ్మూలాలు పోలీసులు తమ ఛార్జి షీట్ లో  నమోదు చేశారు. 90 రోజుల్లో ఈ కేసు విచారణను పూర్తిచేశారు. ఈ కేసులో హత్యచారానికి గురైన శ్రావణి, కల్పనకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి పై పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం తో అతనికి ఉరి శిక్ష ,జీవిత ఖైదు పడింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: