గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి రాజకీయాల్లో తప్పటడుగులు వేసినా .. ప్రస్తుతం మాత్రం చిరంజీవి చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని రెండు అధికార పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని కొందరి వాడిని కాదు నేను అందరి వాడిని అనే సంకేతాలు చిరంజీవి ఇస్తున్నారు. గత కొంతకాలం క్రితం ఏపీకి వచ్చి సీఎం జగన్ ను స్వయంగా కలిసినా ఆ తరువాత అనేక సందర్భాల్లో జగన్ ను పొగుడుతూ.. ఆయన అంత గొప్ప నాయకుడు మరొకరు లేరు అంటూ.. ప్రశంసలు కురిపించారు. ఈ దశలో చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తమ్ముడు జనసేన పార్టీ ఉండగా చిరంజీవి జగన్ ను పొగడడం ఏంటి అని మరికొందరు విమర్శలు చేశారు. ఆయన మాత్రం జై జగన్ అన్నట్టుగానే వ్యవహరించారు. 


తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో అదే రకమైన సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. ఈ వార్త పెద్ద సంచలనం సృష్టించింది.  తాము రాజకీయ అంశాల గురించి చర్చించలేదని, కేవలం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి,  సంక్షేమ పథకాల అమలు తదితర విషయాల గురించి చర్చించేందుకే కలిశామని చిరు చెప్పారు. అలాగే శంషాబాద్ లో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరినట్టు చిరంజీవి తెలిపారు. 


ఈ విషయాలపై srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తానని చెప్పినట్టు చిరంజీవి చెప్పారు. ఇటు ఆంధ్ర అటు తెలంగాణలోనూ చిరంజీవి ఈ విధంగా స్నేహపూరిత వాతావరణం ఏర్పరచుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టుగా అర్థమవుతోంది. గతంలో రాజకీయంగా వచ్చి అనేక విమర్శలు పాలైన నేపథ్యంలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాలని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే తరచుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాలలో పాల్గొంటున్నారు. 


పరిశ్రమకు సంబంధించిన సమస్యలను తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తూ వారికి అండగా నిలుస్తూ వస్తున్నారు. ఒకరకంగా దాసరి నారాయణరావు లేని లోటును చిరంజీవి తీర్చాలని చూస్తున్నారు. తన గుప్పెట్లో తెలుగు సినీ ఇండ్రస్ట్రీని పెట్టుకోవాలంటే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీతో సన్నిహితం గా ఉండాలని ఒక అంచనాకు వచ్చిన చిరంజీవి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తనపై వచ్చే రాజకీయ విమర్శలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలన్నదే చిరు ఆలోచనగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: