ప్రస్తుతం చైనా దేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. కరోనా వైరస్ పేరు చెబుతూనే దేశ ప్రజలందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. కరోనా  వైరస్ తో  రోజురోజుకు ప్రజల పిట్టల్లా రాలిపోతున్నాయి అనే  చెప్పాలి. ఇప్పటికే కరోనా  వైరస్ తో వందల మంది ప్రాణాలు కోల్పోగా... వేల సంఖ్యలో వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. చైనాలోని ఊహన్  నగరంలో ఈ కరోనా  వైరస్ గుర్తించబడింది. ఆ తర్వాత చైనా వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ ప్రాణాంతకమైన కరోనా  వైరస్. కరోనా వైరస్ కారణంగా భారీగా ప్రాణ  నష్టమే  కాదు ఎంతగానో ఆర్ధిక నష్టం కూడా జరుగుతుంది చైనా దేశానికి. అయితే కరోనా  వైరస్ ప్రాణాలు తీయడం కాదు... మహిళలకు ఆత్మరక్షణ గా కూడా మారినట్లు ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. 

 

 

 ఓ దొంగ ఓ  ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అదే సమయంలో మహిళ ఒంటరిగా ఉండటం చూసి... మహిళపై అత్యాచారం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో తెలివిగా ఆలోచించి మహిళ... ఆ వ్యక్తి తనకుతానుగా అత్యాచారం  చేయకుండా వెళ్లేలా తెలివిగా ఆలోచించించి తప్పించుకుంది. ఆ మహిళ వేసిన ప్లాన్ ఏంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి . చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవలే వుహాన్  నగరం నుంచి వచ్చి జింగ్ షాన్ లో  నివాసం ఉంటుంది. కాగా  గత శుక్రవారంనాడు మహిళా  ఉంటున్న ఇంట్లోకి దొంగతనం చేయడానికి ఓ వ్యక్తి ప్రవేశించాడు. 

 

 

 దొంగతనం చేస్తున్న సమయంలో ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉంది అని ఆ దొంగ గ్రహించాడు. దీంతో ఆ మహిళ పై అత్యాచారం చేసేందుకు పూనుకున్నాడు ఆ దొంగ . ఈ క్రమంలోనే ఆ మహిళపై దొంగదాడి చేయబోతున్న సమయంలో... తనకు వుహాన్ లో ఉన్నప్పుడు  కరోనా  వైరస్ సోకిందని  ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి తనను  ఇక్కడ నిర్బంధించారు అంటూ అబద్ధం చెప్పింది. అంతేకాకుండా పలు మార్లు మాట్లాడుతున్న సమయంలో దగ్గుతున్నట్టు నటించింది సదరు మహిళ. దీంతో భయాందోళనకు గురైన ఆ దొంగ ఆమె పై ఎలాంటి అఘాయిత్యం చేయకుండానే... అక్కడినుంచి ఉడాయించాడు. ఇంట్లో ఉన్న కొంత నగదును తీసుకుని.. పరారయ్యాడు దొంగ. అనంతరం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: