తెలంగాణ ఏర్పాటుపై పార్ల‌మెంటులో ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ చేసిన వ్యాఖ్య‌లపై తెలంగాణ పర్యాటక, ఆబ్కారీ, సాంస్కృతిక, క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  విరుచుకుప‌డ్డారు. భాద్యతా రాహిత్య వ్యాఖ్యలు చేశార‌ని ఆరోపించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొంటూ...భాధ్యత గల స్థానంలో ఉన్నానన్న విషయం మోదీ గుర్తించుకోవాలని అన్నారు. రాజకీయాలకు లోక్‌సభ వేదిక కాదని మోదీ గుర్తించుకోవాలన్నారు. 

 

 

``పదవులు మనషులకు సంస్కారం నేర్పాలి. బాధ్యతను గుర్తు చేయాలి. పదవులు, అధికారం శాశ్వతం కాదు.. ఈ విషయం ప్రధాని మోదీ గుర్తు పెట్టుకోవాలి. చట్టసభల్లో తానో బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నానన్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుంచుకుని మాట్లాడితే మంచిది. తెలంగాణ ఉధ్యమం గురించి.. ఇక్కడి ప్రజల ఆకాంక్ష గురించి ఏ మాత్రం తెలిసినా ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు. దేశ అత్యున్నత చట్టసభ లోక్ సభలో రాష్ట్ర విభజన సమగ్రంగా జరుగలేదు, అర్ధరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టారని, తలుపులు మూసి తీర్మాణం చేసిందని ప్రధాని మోదీ మట్లాడడం దురదృష్టకరం` అని అన్నారు. 

 

``నాలుగు దశాభ్దాల ఉధ్యమ పోరాటం. వందలాది అమరుల త్యాగఫలం, కేసిఆర్ పోరాట పటిమ,  నాయకత్వంలో తెలంగాణ ఇవ్వక తప్పని అత్యవసర పరిస్థితి ఏర్పడినందునే మీ పార్టీ బిజేపి మద్దతు తెలిపింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆంద్రప్రదేశ్ ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. జాతీయ పార్టీలన్నీ తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకుని మద్దతు తెలిపాయి కాబట్టే తెలంగాణ సాధ్యమయ్యింది. రాజకీయాలకోసం మీ గొప్పల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తక్కువ చేసి మాట్లాడడం మీ స్థాయిని తగ్గించుకోవడమే. దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి, మతం పేరుతో అధికారం దక్కించుకునే మీ లాంటి వ్యక్తులకు తెలంగాణ బిడ్డల పోరాటం కనిపించదు.  కాశ్మీర్ ని విభజించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రపంచానికి తెలియనీయకుండా.. అక్కడి పౌరులను, జనజీవనాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో అందరికి తెలుసు..  తెలంగాణపై విషయం చిమ్మిన ప్రధాని వ్యాఖ్యలపై ఇక్కడి బిజేపి నాయకులు క్షమాపణ చెప్పాలి. మోదీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించారు. తెలంగాణ ప్రజలు అందుకే మీకు ప్రతీ ఎన్నికల్లో శిక్ష విధించారు. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు.` అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: