ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి.. ప్రతిపక్ష టిడిపి పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  అమరావతిని కొనసాగించాలని...3 రాజధానిలు నిర్మించ  వద్దంటూ టిడిపి తీవ్ర స్థాయిలో అధికార పార్టీపై  విరుచుకుపడుతుంది. అంతే కాకుండా అటు  అమరావతిలో కూడా రైతులు మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 50 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మొదటి నుంచి ప్రతిపక్ష టిడిపి పార్టీ రైతుల నిరసన కు మద్దతు తెలుపుతూ... జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. 

 

 

 అయితే విపక్ష పార్టీ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ 3 రాజధానిల  నిర్మాణానికి ముందు అడుగు వేసిన జగన్ సర్కార్ దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించింది.  ఇక ఆ తర్వాత ఈ బిల్లు శాసన మండలికి వెళ్ళేసరికి అక్కడ అధికార వైసిపి పార్టీ కి తక్కువ మెజారిటీ ఉండడం టిడిపికి ఎక్కువ మెజారిటీ ఉండడంతో... బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ శాసన మండలి రద్దుకు  నిర్ణయించారు. అయితే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపేలా శాసనమండలి చైర్మన్ సహా టిడిపి ఎమ్మెల్సీ లందరిని  తీవ్రస్థాయిలో ప్రలోభాలకు గురి చేశారు అంటూ  టిడిపి గతంలో ఆరోపణలు కూడా చేసింది. జగన్ సర్కార్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ నిజాయితీగా ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు కూడా పలుమార్లు తెలిపారు. 

 

 

 ఇక తాజాగా ఈ అంశానికి సంబంధించి టీడీపీ  కీలక నేత మాజీ మంత్రి  దేవినేని ఉమా పలు వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు చేపడుతున్న నిరసనకు  మద్దతు తెలుపుతూ... రైతుల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేవినేని ఉమ... మూడు రాజధానులు సీఆర్డీఏ బిల్లును ఆమోదింపజేసేందుకు వైసీపీ నేతలు ఏకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ నే  ప్రలోభాలకు గురి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. శాసనమండలి చైర్మన్ కు ఏకంగా 50 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారని దేవినేని ఉమా తెలిపారు.  అంతే కాకుండా ఒక్కొక్క టిడిపి ఎమ్మెల్సీ కి 25 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారని... అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ ప్రజల పక్షాన నిలబడి న్యాయం వైపు నడిచారూ  ఉంటూ దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: