ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరుడుగట్టిన మానసిక రోగి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా పరిపాలించి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారని తుగ్లక్ పరిపాలన చేశారని ఇందువల్లనే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ఓడించారని తెలిపారు. అంత దారుణంగా ఓటమిపాలైన ఆయనలో కనీసం ఒక్క మార్పు కూడా రాలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై ఆయనకి గౌరవం లేదు మరియు లెక్కలేని తనం కూడా లేదు ఆయన వ్యవహారశైలి అసలు మారడం లేదు ప్రజలు తిరస్కరించిన ఎలక్షన్లలో గట్టిగా బుద్ధి చెప్పిన చంద్రబాబు లో మార్పు రాలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసులకు భయపడి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ విడిచి పారిపోయి వచ్చేశారు.

 

చంద్రబాబు తుగ్లక్‌ లాగ వ్యవహరించ బట్టే ప్రజలే తీర్పు ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం కల్పించుకుంటే ఆయనను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేకుండా పోయింది. రాజధాని ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు చెప్పే క్యాపిటల్‌ ప్రాంతంలోనే లోకేష్‌ను ప్రజలు గత ఎన్నికలలో గట్టిగా తిరస్కరించారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి..చంద్రబాబు ఈ విధంగానే రాబోయే రోజుల్లో రాజకీయాలు చేసుకుంటూ పోతే...తీవ్ర ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. 

 

రాజధాని విషయంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు పై ప్రజలకు నమ్మకం లేక గత ఎన్నికలలో చాలా గట్టిగా బుద్ధి చెప్పారని అయినాగానీ చంద్రబాబులో మార్పు రాలేదని విమర్శించారు. ఎలాగైనా ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే చాలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: