ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి వరకు రాజధాని అమరావతి గురించి రాజకీయ మొత్తం వేడెక్కింది. ఈ విషయంలో అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళనలు నిరసనలు చేపట్టడం జరిగింది. ఇదే తరుణంలో వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చాలా విషయాలలో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఫాలో అవడంతో అధికార పార్టీ నేతలు వైసీపీ నాయకులు చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాల్లో నటిస్తున్నారని అనేకసార్లు విమర్శలు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల బీజేపీ పార్టీలో పొత్తుల పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా చంద్రబాబు డైలాగులు రిపీట్ చేసినట్లు ఏపీ పరిశ్రమలు విషయంలో స్పందించారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన చూసి పెట్టుబడులు రావడంలేదని పరిశ్రమలు వెళ్లి పోతున్నాయని చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరీ ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అయితే కొద్ది గంటల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం గురించి సేమ్ బాబు డైలాగులు మాదిరిగానే మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులకు అనుగుణంగా వాతావరణం క్రియేట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం దోహద పడటం లేదని ఫెయిల్ అయిందని విమర్శించారు.

 

అంతేకాకుండా కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి పోతున్నాయని ఆయన అన్నారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ వార్త ఇచ్చిన రాయిలర్స్ సంస్థ ఆషామాషీ సంస్థ కాదని ఆయన అన్నారు. ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్దులు, కూల్చివేతలు, తరలింపులు అంటోందన్నారు. అనేక విషయాలలో జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: