టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. అందులో హైదరాబాద్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. నేనే.. నేనే.. అని చెప్పకుండా ఆయన ప్రెస్ మీట్ ముగియదు. పాపం.. రిపోర్టర్లకు కూడా ఇది బాగా అలావాటైపోపోయంది. హైటెక్ సిటీ ఆయన హయాంలోనే కట్టడం, మాదాపూర్ ప్రాంతం చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి కావడం చాలా మంది ఆయన వ్యతిరేకులు కూడా అంగీకరిస్తుంటారు.

 

అంతెందుకు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన సేవలను ఓ సమావేశంలో గుర్తించారు కూడా. అయితే ఇదంతా వట్టిదేనట.. హైటెక్ సిటీ క్రెడిట్ కూడా చంద్రబాబుదేం కాదట. వాస్తవానికి హైటెక్ సిటీ క్రెడిట్.. చంద్ర బాబు కన్నా ముందటి ముఖ్యమంత్రి నేదురు మల్లి జనార్థన్ రెడ్డిదట. వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు.

 

వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇదే తరహాలోమాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. “ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ తన తప్పులు బయటపడుతాయోనని రాష్ట్రంలోకి సీబీఐని రానివ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై జోక్యం చేసుకోకూడదని మాట్లాడి..ఇప్పుడు పదవి పోయాక కేంద్రం జోక్యం చేసుకోవాలంటావా? అంటూ విమర్శించారు.

 

వైయస్‌ఆర్‌ హయాంలో వాన్‌పిక్‌ వంటి పరిశ్రమలు తీసుకొస్తే..ఆ రోజు సోనియా గాంధీతో చంద్రబాబు కుమ్మక్కై వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టించారు. చంద్రబాబు రాష్ట్రానికి తెప్పించిన పరిశ్రమలు ఏంటో చెప్పాలి. హైదరాబాద్‌లోని హెటెక్ సిటీని నేదురుమళ్లి జనార్థన్‌రెడ్డి హాయంలో శంకుస్థాపన చేస్తే దాన్ని నీ ఖాతాలో వేసుకున్నావు. ఇవాళ అమరావతిలో టీ తాగేందుకు వీలు లేదు.. అంటూ చంద్రబాబు ఐదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. మరి ఈ మాటలో ఎంత వరకూ నిజం ఉంది.. నిజంగా హైటెక్ సిటీలో చంద్రబాబు క్రెడిట్ లేదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: