అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా చేస్తానని సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చెప్పేవారు.. ఇందుకు అనుగుణంగా టార్గెట్లు కూడా ఫిక్స్ చేసేవారు. కానీ వాటిలో ఏదీ సరిగ్గా సాగలేదు. ఇప్పుడు ప్రపంచ రాజధాని సంగతి అంటుంచి అసలు ఉన్న రాజధానికే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చింది. రాజధాని మార్పు కచ్చితమని చెబుతున్న వైసీపీ నేతలు అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని అంటున్నారు.

 

 

పేదల మధ్య తిరిగిన వైయస్‌ జగన్‌.. పేదల సంక్షేమం, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కలలు కన్న వైయస్‌ఆర్‌ తనయుడిగా.. తాను కూడా ఆచరణలో చూపించాలని మొదటి రోజు నుంచి కష్టపడుతున్న నాయకుడని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ రైతుల బాధలను నిర్లక్ష్యం చేయడని.. యాన్యువిటి పెంచాల్సిన అవసరం లేదని చాలా మంది అన్నారని... నిర్లక్ష్యం చేశామని ఫీలింగ్‌ ఎవరిలో రాకూడదని ఆయన అన్నారు.

 

 

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. " అభివృద్ధి పనులు, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌లు రావడానికి కొంత టైమ్‌ పడుతుంది కాబట్టి యాన్యువిటీ పెంచారు. కరకట్ట రోడ్డు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి.. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పుకున్నాడు.. కనీసం కరకట్ట మీద రోడ్డు కూడా నిర్మించలేదు. రూ. 3 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు దాంట్లో రూ. లక్ష కోట్లను రోడ్ల డెవలప్‌మెంట్‌కు వెచ్చించి ఉంటే వైయస్‌ జగన్‌కు ఈ ఆలోచన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.

 

ఆ రోజు నువ్వు ఎందుకు ఇక్కడ ఉండడం లేదని అన్నాడు... ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కోట్లు పెట్టుకొని కట్టుకున్నాడని అంటున్నాడు. అది నాలుకేనా చంద్రబాబూ..? ఎవరో నది ఒడ్డున కట్టుకున్న అక్రమ నివాసంలో ఉంటున్నాడు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదు.. మానసిక వైకల్యంతో చేస్తున్న వికృత చేష్టలు.. అంటూ మండిపడ్డారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: