కియా ప్రాజెక్టు తరలిపోతోంది.. ఇదీ తాజాగా బాగా జరిగిన ప్రచారం.. అయితే దీన్ని ఆ పరిశ్రమ ప్రతినిధులతో పాటు ప్రభుత్వమూ ఖండించింది. అయితే ఈ వార్తా కథనాల వెనక ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు కూడా చేయిస్తుందట..తగిన చర్యలు కూడా తీసుకుంటుందట.. జర్నలిజం ముసుగులో కొంతమంది అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు.

 

కియామోటర్స్‌ ఏపీ నుంచి తరలిపోతుదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కియా మోటర్స్‌, ఏపీ ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, రెండు కలిసి పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. కియామోటర్స్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాల సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కియా మోటర్స్‌కు సంపూర్ణ సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు.

 

గతేడాది డిసెంబర్‌లో కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా కంపెనీ నిర్వహించిన కార్యక్రమానికి సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంపెనీ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామనే అంశాన్ని విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. అయినప్పటీకి కియా మోటర్స్‌ తరలిపోతుందంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించడంతో పాటు తీవ్రంగా పరిగణించింది. తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 

మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారనివిజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్‌ పెరిగాయంటూ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ!’ అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: