2019లో ఎన్నికల్లో ఓటమి తరువాత బాబు పరిస్థితి మరీ దిగజారింది. గతంలో ఎన్నడూ లేనంత బేళగా మాట్లాడుతున్నాడు బాబు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా జగన్‌కు దండం పెట్టి మరీ వేడుకున్నాడు బాబు. అయితే చంద్రబాబు అధికారంలో ఉండగా జగన్‌ను అష్టదిగ్భందనం చేసిన బాబు, ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. తనతో పాటు తన సహచరులను, సన్నిహితులను టార్గెట్ చేసి జగన్‌ ఇబ్బందుల పాలు చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నాడు.

 

తాజాగా బాబు అండ్‌ టీంకు ఐటీ షాక్‌ తగిలింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన కొంతమందిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. బాబు ఆర్థిక మూలాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో ఆక్రమ సంపాదన వెలుగులోకి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దాడుల గురించి స్పందించేందుకు ఐటీ అధికారులు మాత్రం నిరాకరించారు.


గతంలో చంద్రబాబు వద్ద పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు బినామీ ఆస్తులు సంపాదించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇన్‌కం టాక్స్‌ అధికారులు ఒకేసారి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఎన్నికల తర్వాత సెక్రటేరియట్‌లో పని చేస్తున్నాడు.

 

దాదాపు పదేళ్ల పాటు బాబు దగ్గరే వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బు వెనకేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. శ్రీనివాసులు, నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడన్న ప్రచారం కూడా ఉంది. మరికొంత మంది తెలుగు దేశం నేతల ఇళ్లు కార్యలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఈ దాడులు జరిగాయి. దాడుల్లో వారికి హాస్పిటల్స్‌, ఎడ్యుకేషనల్ ఇన్సిస్టిట్యూట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌, థియేటర్స్‌ లాంటి బిజినెస్‌లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: