8 నెలల క్రితం ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని చంద్రబాబుకు ముందే తెలిసిందా..? పైకి 150 సీట్లు మావే అంటూ ప్రగల్బాలు పలికినా.. ఓటమి సంగతి ముందే తెలిసిపోయిందట. అది కూడా మూడు, నాలుగు నెలల ముందే ఇక మనం అధికారంలోకి వచ్చేది లేదని చంద్రబాబు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఎలాగూ మళ్లీ అధికారంలోకి రానని నమ్మకం ఉండటం వల్లే చివరి రోజుల్లో విచ్చల విడిగా అప్పులు చేసి.. కాబోయే సీఎం జగన్ ను ఇరుకున పెట్టాలని ముందే ప్లాన్ చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.

 

ఎందుకంటే జగన్ సీఎం అయ్యేనాటికి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయి ఉంది. చంద్రబాబు దిగిపోతూ దాదాపు రూ.38 వేల కోట్ల పనులు, సీఆర్‌డీఏ లెక్కేసుకుంటే లక్ష కోట్ల పనులకు డీపీఆర్‌లు లేకుండా టెండర్లను పిలిచారు. దాదాపు రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్‌ పెట్టారు. సూదికి, దూదికి పెండింగ్‌ పెట్టారు. ఆ బకాయిలు అన్నీ కూడా ఇప్పుడు జగన్ సర్కారు కట్టాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు డిసెంబర్‌ వరకు ఈ ప్రభుత్వం క్లియర్‌ చేసింది.

 

పవర్‌ సప్లయ్‌ పేరు మీద విచ్చల విడిగా అప్పులు చేసి పసుపు కుంకుమ అని ఎన్నికల్లో ఖర్చులు చేశారు. ఆ అప్పులు ఇప్పుడు జగన్ సర్కారు తీర్చాలి. పైగా ఇప్పుడు జగన్ సర్కారుకు రాబడి రావడం లేదని చంద్రబాబు అంటున్నారు. డిసెంబర్‌ 15 వరకు లెక్కలెస్తే..రూ.15,214 వ్యాట్‌, జీఎస్టీలో రావాల్సిన భాగం. జగన్ ప్రభుత్వం 975 కోట్లు ఎక్కువగా పన్నులు వసూలు చేసింది. గతేడాది 6.8 శాతం పన్నుల వసూలు పెరిగింది. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది కాబట్టి రాష్ట్రంలోనూ తగ్గింది.

 

తాజా రెవెన్యూ కలెక్షన్లు పరిశీలిస్తే..గతేడాది రూ.28,800 కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుతం రెండు శాతం ఎక్కువగా వచ్చాయి. దేశవ్యాప్తంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. అంతే కాదు.. చంద్రబాబు పోతూ.. పోతూ... అప్పులు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేసి వెళ్లారట. ఈ లెక్కలన్నీ తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బయటపెట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: