ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు సాధించిన విజయాలను చూసి సంతోషపడతారు. అనునిత్యం శ్రమించి విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవడానికి తమ వంతు సహకారం ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందిస్తారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు చేసిన పనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 
 
మార్చి నెల చివరివారంలో ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగబోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు రివిజన్ టెస్టులను కండక్ట్ చేస్తున్నారు. కానీ కొందరు విద్యార్థులు రివిజన్ టెస్టులకు హాజరు కాకుండా ఉండటంతో రాయలసీమలోని కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తున్న ఆనంద్ మోకాళ్లపై కూర్చుని రెండు చేతులు జోడించి రివిజన్ పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులను కోరారు. 
 
పదో తరగతి యొక్క ప్రాధ్యాన్యత విద్యార్థులకు తెలియాలని రివిజన్ టెస్టులకు హాజరు కాని అనిల్ శంకర్, కార్తీక్, కమలాకర్, షాబుద్దీన్ లను పాఠశాలకు పిలిపించి రివిజన్ పరీక్షలకు ఎట్టి పరిస్థితులలోను మిస్ కావద్దని ఆనంద్ కోరారు. వినూత్నంగా విద్యార్థులకు జీవితంలో పదో తరగతి ప్రాధాన్యతను అర్థమయ్యేలా చెప్పిన ఉపాధ్యాయుడు ఆనంద్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 
 
సోషల్ మీడియాలో గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఏపీ రాష్ట్ర గణిత ఫోరం ఉపాధ్యక్షుడు త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి మరియు తెలంగాణ గణిత ఫోరం అధ్యక్షులు పసుపులేటి నరేంద్ర స్వామి అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్ గణిత ఉపాధ్యాయుడు ఆనంద్ చేసిన పనిని మెచ్చుకున్నారు. గణిత ఉపాధ్యాయులు విద్యార్థులు గణితంలో మంచి మార్కులు సాధించటం కొరకు ఎంతో కష్టపడుతున్నారని ఆనంద్ ను ప్రశంసించారు.             

మరింత సమాచారం తెలుసుకోండి: