కియా ప్రాజెక్టు తరలిపోతోంది.. ఇదీ తాజాగా బాగా జరిగిన ప్రచారం.. అటు సోషల్ మీడియాలోనూ..ఇటు మెయిన్ మీడియాలోనూ ఈ ప్రచారం జోరుగా సాగింది. అయితే దీన్ని ఆ పరిశ్రమ ప్రతినిధులతో పాటు ప్రభుత్వమూ ఖండించింది. అంతే కాదు.. కియా పరిశ్రమ కోసం తాము ఏమేం చేశామో వివరించింది. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిశ్రమల శాఖలో పురోగతి సాధించిందట.

 

కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుందని ఏపీ సర్కారు మండిపడుతోంది. పరిశ్రమ తరలిపోతోందన్న కథనాలను కియా నిర్వాహకులే ఖండించారని గుర్తు చేసింది. ఇటీవల సీఎం వైయస్‌ జగన్‌ కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పరిశ్రమ ఎండీతో పాటు కొరియా అంబాసిడర్‌ కూడా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకానికి సంతోషపడ్డారట. రోడ్డుపై అండర్‌ బ్రిడ్జి కావాలని కియా పరిశ్రమ కోరడంతో సీఎం వైయస్‌ జగన్‌ వెంటనే అంగీకరించారట కూడా..

 

ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారట. జగన్ స్పందనపై కియా ఆపరేషన్‌ హెడ్‌ పార్క్‌ సంతోషం వ్యక్తం చేశారట. కియా పరిశ్రమ ఎక్కడికి తరలిపోవడం లేదని, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు త్వరలోనే రాబోతున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే..” కియా పరిశ్రమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఓర్వేలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఏపీ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు. 2008లో తాను రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌లో ఉన్నప్పుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కియా పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పట్లో కోరినట్లు పార్క్‌ సీఎం వైయస్‌ జగన్‌కు లేఖ కూడా రాశారు. రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో కియా ప్లాంట్‌ పెట్టారు. కియా కార్లు బ్రహ్మండంగా తయారై మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: