అమరావతి పేరుతో చంద్రబాబు చేసేది అరాచకీయం. మానసిక వైకల్యంతో చేస్తున్న వికృత చేష్టలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన వెనుక వున్న వారు గత్యంతరం లేక ఆయనను అనుసరిస్తున్నారు.  వారితోనే ఉద్యమం పేరుతో వ్యాసంగం చేసుకుంటున్నారు.  ఎనిమిది నెలల కిందట చంద్రబాబు పాలనపై ప్రజలు రెఫరెండం ఇచ్చారు.  జగన్  మొదటి రోజు నుంచే కష్టపడుతున్నారు . మీలాగా విజయం 2020, ఆ తరువాత 2050 అంటూ చెప్పుకోము. ప్రజలకు మేలు చేసే విషయంలో ముందుగా ప్రకటించినట్లు నిర్ధిష్ట సమయంలో చేస్తున్నాం. చంద్రబాబు కరకట్టపై తన కాన్వాయితో దర్జాగా పోతున్నారు. కరకట్ట రోడ్డు చూసి అయినా చంద్రబాబుకు సిగ్గు కలగాలి. అన్ని తెలిసి తానే కారణమై...అమరావతి రాజధాని నాశనానికి కారణమయ్యాడు.

 

కనీసం రోడ్లు డెవలప్ చేసి వున్నా .. జగన్ కి అమరావతి మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చేది?.  తాను అక్రమంగా కృష్ణా నది ఒడ్డున ఎవరో కట్టిన ఇంట్లో నివాసం వుంటున్నాడు.  సీఎంగా ఇచ్చిన ఫర్నీచర్ ను కూడా వాడుకుంటున్నాడు.  జగన్  సొంతంగా ఇక్కడ ఇల్లు కట్టుకుని సెటిల్ అవుదామని వచ్చారు.  దీనికి కూడా కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చంద్రబాబు ఎలా విమర్శలు చేస్తారు?. మా మేనిఫేస్టోను ను అమలు చేస్తున్నాము.జగన్ హావభావాల మీద, ఆయన వేసుకున్న దుస్తుల మీదనో.. .ఆయనపై వున్న కేసులపైనో చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఇవ్వన్నీ చూసిన తరువాత కూడా ప్రజలు పెద్ద మెజారిటీతో జగన్ గారికి అధికారం ఇచ్చారు.  


అమరావతిలో అన్ని పథకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అభివృద్థి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చంద్రబాబు మాత్రం భ్రమలు కల్పించే ఉద్యమం చేస్తున్నారు.  చంద్రబాబుది నాలికా.. తాటిమట్టా..?.   జనసేన లెటర్ హెడ్లు కూడా టిడిపి వద్దే వుంటున్నాయోమేనని అనిపిస్తోంది. కియో మోటర్స్ వెళ్ళిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టిడిపి వారు చేస్తున్నవన్నీ పిల్లి శాపాలే. మీడియాను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు.  కియా సంస్థకు ప్రభుత్వం ఎటువంటి ప్రతికూల వాతావరణం సృష్టించలేదు. చంద్రబాబు కల్పించిన ప్రతికూల వాతావరణం నుంచి ప్రభుత్వంను జగన్ నడుపుతున్నారు.

 

మాకు అధికారంను అప్పగించిన సమయంలో అరవై వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో వున్నాయి. రూ. 2.50 లక్షల కోట్లు అప్పులు చేశారు.. ఈ నిధులన్నీ ఎం చేశారో తెలియదు. అసలు మనుషులు లేకుండా.. కుటుంబాలు లేకుండా అమరావతిని ఎలా భూతల స్వర్గం చేస్తారు. .జూబ్లీ హిల్స్ తరహాలో ఈ ప్రాంతంను అభివృద్థి చేయవచ్చని భావించారు. ఈ మొత్తం భూమిలో రెసిడెన్షియల్ ప్లాట్లు వున్నాయి.  ఒకవేళ మంచి రేటు వస్తే... ముందు ఈ ప్లాట్ లకే వస్తుంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ లకు రేటు తక్కువ వస్తుంది.  చంద్రబాబు చేసిన ఈ మోసాన్ని రైతులు ఎలా నమ్మారు?.  ఓవైపు ప్రధాన ప్రాంతాన్ని ఫారెన్ కంపెనీలతో అభివృద్ధి చేయించి. మీ వెయ్యి గజాలకు  రూ.1.40 కోట్లు వస్తుందని చెప్పి రైతులను మోసం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: