గత కొన్ని నెలలుగా పేద పిల్లలను టార్గెట్ చేసి ఎత్తుకెళుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఈ ముఠాను విచారించగా పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ముఠా సభ్యులైన మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేశారు. నిరుపేద పిల్లలను కిడ్నాప్ చేసి లేదా పేద పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ఈ ముఠాలు పిల్లలను వేరేవారికి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
గత నెలలో ఒక చిన్నారి కిడ్నాప్ కావడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో గత నెల 27వ తేదీన అల్వాల్ లో ఒక చిన్నారి కిడ్నాప్ అయినట్లు కేసు నమోదైంది. పోలీసులు అల్వాల్ ప్రాంతంలో అనుమాస్పదంగా తిరుగుతున్న రేణుక, శమంతకమణి అనే ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అల్వాల్ లో కిడ్నాప్ అయిన పాపను తామే కిడ్నాప్ చేసినట్టు వారు ఒప్పుకున్నారు. 
 
ఈ కిడ్నాప్ దందాను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గంగాధర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన బాబురెడ్డి నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పిల్లలను కిడ్నాప్ చేసి లేదా పేద పిల్లలను డబ్బులకు కొని పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలోనే గంగాధర్ రెడ్డి, బాబురెడ్డిపై పలు కేసులు నమోదు అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే వారి వివరాలను సేకరించి వారికి కిడ్నాప్ చేసిన పిల్లలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బాలనగర్ డీసీపీ పద్మజ మాట్లాడుతూ నిందితులు పిల్లలు అవసరం ఉన్నవారి సమాచారం తెలుసుకొని పిల్లలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు నిందితుల దగ్గర ఉన్న ఇద్దరు చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితులలో ఒక మహిళ పరారీలో ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: