ఇటీవల తమిళ సూపర్ స్టార్ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం తెరకెక్కిన చిత్రం దర్బార్. ప్రేక్షకులు ఎన్నో అంచనాలను కలగజేసిన  ఈ చిత్రం... సంక్రాంతి పండుగ ముందు దేశ వ్యాప్తంగా విడుదలైంది. అయితే సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది ఈ సినిమా. కానీ విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయింది అని అక్కడక్కడా టాక్ కూడా వినిపించింది. సినిమా చూసిన కొంతమంది అభిమానులు సినిమా సూపర్ హిట్ అని చెబితే కొంతమంది అభిమానులు మాత్రం.... అంతగా ఏమీ లేదు అని నిరాశ చెందారు. ఈ క్రమంలో దర్బార్ సినిమా మిక్సుడ్  టాక్ తో సాగింది. 

 

 అయితే దర్బార్ సినిమా ఎన్నో కలెక్షన్లు రాబట్టింది అని చిత్రబృందం పలుమార్లు ప్రకటనలు చేసినప్పటికీ... ప్రస్తుతం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ల తీరు చూస్తుంటే మాత్రం అదంతా ఫేక్ అని తెలుస్తోంది. దర్బార్ సినిమా ద్వారా అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎంతగానో నష్టం వచ్చిందని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు రావడంతో ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి హీరో రజనీకాంత్ దర్శకుడు మురుగదాస్ సహ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నష్టాలను భర్తీ చేయాలని కోరుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.  జనవరి 9న విడుదలైన ఈ సినిమా మిక్సుడ్  టాక్ సొంతం చేసుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అటు దర్బార్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా హీరో రజనీకాంత్ తో పాటు దర్శకుడు మురుగదాస్ ను కూడా నష్టపరిహారం అడుగుతా మంటూ తెలిపారు. ఈ క్రమంలోనే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఇటీవలే రజినీకాంత్ ని నష్టపరిహారం అడిగేందుకు వెళ్లగా... రజినీకాంత్ ను  కలవకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

 

 

 ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు అందరూ దర్శకుడు మురుగదాస్ ను కలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్బార్ సినిమా దర్శకుడు మురగదాస్ తనకు పోలీస్ సెక్యూరిటీ కావాలి అని తన ఇంటి దగ్గర మరింత భద్రత కల్పించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇప్పటికి డిస్ట్రిబ్యూటర్లు అందరూ దర్బార్ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. దర్బార్ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా తమకు ఏమాత్రం అండగా నిలబడేలేదు డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. దర్బార్ సినిమాతో తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: