జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతో ఒత్తయిన జుట్టుతో ఇప్పటివరకు ఒక ఉద్యమ నాయకుడిగా ఏపీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తూ కనిపించరు. నిత్యం ప్రజా పోరాటాలు చేస్తూ ఏదో ఒక అంశంపై హడావుడి చేస్తూ జనసేన పార్టీకి మైలేజ్ తెచ్చేలా ఆయన రాజకీయ వ్యవహారాలు నడిపించారు. అయితే ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కొత్తగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొన్నటి వరకు పవన్ యాక్టివ్ పాలిటిక్స్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఆయన రాజకీయంగా కాస్త సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. 


ఇదే సమయంలో పింక్ రీమేక్ సినిమాలో నటించేందుకు ఒప్పందం చేసుకోవడం, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడంతో పవన్ పూర్తిగా సినిమాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొన్నటి వరకు గుబురు గడ్డం ఒత్తయిన జుట్టు తో కనిపించిన ఆయన ఇప్పుడు మాత్రం గత పవర్ స్టార్ ఎలా ఉండేవాడు అలా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాజాగా కొత్త లుక్ లో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కనిపించారు. 


ఈ కొత్త గెటప్ లో చాలా కాలం తరువాత పవన్ ను చుసిన అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా పేరు పోగొట్టుకున్న అదే సినిమాల్లో ఉండి ఉంటే ఇంకా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఉండేవాడని ఈ సందర్భంగా అభిమానులు చర్చించుకున్నారు. పవన్ లుక్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే పింక్ రీమేక్  సినిమా లో నటిస్తున్న పవన్ ఆ తరువాత రెండు సినిమాలకు సంతకాలు చేసిరానని ఇక ఎక్కువ సమయం సినిమాల్లోనే పాల్గొంటారని, అప్పుడప్పుడూ రాజకీయాల వైపు వస్తారనే ప్రచారం జరుగుతోంది. 


మొన్నటి వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసినా, తాను పొత్తు పెట్టుకున్న బీజేపీ వైసీపీకి మద్దతుగా నిలబడడంతో ఏపీలో తాను ప్రజా పోరాటాలు చేసేందుకు పెద్దగా అవకాశం దక్కదని ఆలోచనతోనే సినిమాల్లో బిజీ అవ్వాలని పవన్ చూస్తున్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: