ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయంపై ఇప్పటికీ రగడ కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జగన్ చేయాలనుకుంటున్నది  చేసుకుంటూ ముందుకు సాగుతుంటే... అటు విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేయడం ఆపటం  లేదు. అటు అమరావతిలో రైతులు కూడా నిరసనలు ఆపడం లేదు. ప్రతి అంశాన్ని మూడు రాజధానిల ప్రకటనతో ముడిపెడుతూ విమర్శలు గుప్పిస్తోంది టిడిపి పార్టీ. టిడిపి పార్టీ నేతలందరూ ప్రస్తుతం జగన్ 3 రాజధానిల ప్రకటనను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారు. అటు అమరావతిలో రైతులు చేపడుతున్న ధర్నాలు నిరసనలకు  కూడా మద్దతు తెలుపుతున్నారు టిడిపి నేతలు. 

 

 

 అయితే టిడిపి పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఇప్పటికే పలుమార్లు పాలనా వికేంద్రీకరణ సంబంధించిన నిర్ణయం పై జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టిడిపి కీలక నేత పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అన్ని తెలివితేటలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా లేవు అంటూ టిడిపి నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారు ఎంపీ కేశినేని నాని. 

 

 

 ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉన్నప్పుడే పరిపాలన సజావుగా సాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే... జగన్ మూడు  రాజధానులు ఎందుకు నిర్మించాలనుకున్నారు అంటూ ప్రశ్నించారు. జగన్ నీకున్న తెలివితేటలు మోదీ గారికి కూడా లేవు. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేరు వేరు చోట్ల ఉండడం వల్ల సమర్థవంతంగా పరిపాలన జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యాలయలను  ఒకే చోటకు తీసుకు వస్తుంది. ఒకవేళ పొరపాటున నువ్వు  ప్రధానమంత్రి అయి వుంటే మాత్రం 28 రాష్ట్రాలలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో 36 రాజధానులు పెట్టే వాడివి అంటూ టిడిపి నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: