ఆ రాష్ట్రం... భారత దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. అక్కడ ఎక్కువ మొత్తంలో అక్షరాస్యులు ఉంటారు. వారు  చేసే పని ఎలాంటిది అయినప్పటికీ... మంచి చదువులు చదువుకుని ఉంటారు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది అనుకొంటున్నారా... ప్రతి సంవత్సరం అక్షరాస్యత రేటులో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్న రాష్ట్రం కేరళ. కేరళ రాష్ట్రం పచ్చదనానికి ప్రకృతికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పడమే కాదు... చదువుల తల్లికి కూడా నిలువెత్తు రూపం  అనవచ్చు. ఇక మరో సారి కేరళ రాష్ట్రం చదువుకు నిలువెత్తు రూపం అని నిరూపించింది. 105 సంవత్సరాల వృద్ధురాలు నాలుగో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. 

 

 

 అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది... చదువుతూ వయస్సుకు సంబంధం ఏమున్నది... సంకల్పంతో ముందుకు సాగితే సాధ్యం కానిది ఏమున్నది అని నిరూపించింది ఈ 105 సంవత్సరాల వృద్ధురాలు. వివరాల్లోకి వెళితే.. కేరళ లో నివాసం ఉంటున్న 105 సంవత్సరాల వృద్ధురాలు నాలుగో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినది. కొల్లం జిల్లాకు చెందిన భాగీరథి అనే వృద్ధురాలు 74.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు కేరళ అక్షరాస్యత మిషిన్ వెల్లడించింది. 275 మార్కులకుగాను పరీక్షలు జరుపగా ఈ బామ్మకు 205 మార్కులు వచ్చాయి. 

 

 

 గణితశాస్త్రం పరీక్ష 75 మార్కులకు ఉండగా.. ఏకంగా భాగీరథి అనే ఈ 105 సంవత్సరాల బామ్మా  75 మార్కులకు 75 మార్కులు సాధించడం గమనార్హం. ఆంగ్లంలో 30 మార్కులకు పరిమితమైన... ఆరోగ్యం సహకరిస్తే మాత్రం ఐదో తరగతి కూడా చదువుతాను అంటూ ఎంతో నమ్మకంగా చెబుతుంది 105 సంవత్సరాల వృద్ధురాలు. అయితే ఇంత వృద్ధ వయసులో కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు గాను కేరళ ప్రభుత్వ పెద్దలతో పాటు బంధుమిత్రులు భాగీరథి అనే బామ్మాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏదేమైనా చదువుకు వయసుతో సంబంధం లేదు ఏ వయసులోనైనా చదువుకోవచ్చు అని చాటి చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: