టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు మామూలుగా ఉండవు... టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటే ఇది నిజమా అబద్దమా అని నమ్మలేక పోతుంటారూ  కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు. అయితే ప్రకటనలకు కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ... కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆ ప్రకటనలు నిబంధనలు పాటించకుండా నే అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు. మా క్రీమ్ పెట్టుకుంటే వారం రోజుల్లో తెల్లగా అయిపోతారు.. మా షాంపూ వాడితే వారం రోజుల్లో మీ  బట్టతల కాస్త జుట్టు తలగా  మారిపోతుంది అంటూ తెగ ప్రకటనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ వాడితే మీ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అంటూ తెలుగు ప్రకటనలు చేస్తూ ఉంటారు.ఇలాంటి ప్రకటనపై ఇప్పుడు కేంద్రం కొరడా ఝుళిపించింది. అసత్యాలు అభూతకల్పనలు తో వ్యాపార ప్రకటనలు గుప్పించే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

 

 

 కొన్ని రకాల రుగ్మతలు వ్యాధుల కోసం మాజిక్ రెమిడీ ల  పేరుతో ప్రజలను మభ్యపెట్టేలా ఉండే ప్రకటనలపై ఇక పై కఠిన శిక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అభ్యంతరకరమైన ప్రకటనల చట్టం 1954 ముసాయిదా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తే సదరు సంస్థలకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు 50 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించనున్నారు అధికారులు. కాగా ఈ జాబితాను 79 వ్యాధులను చేర్చింది కేంద్ర మంత్రిత్వ శాఖ. 

 

 

 ఎయిడ్స్ వ్యాధి నివారణ, శరీరం ముఖం రంగును మార్చే క్రిములు, ఆంటీ ఏజెంట్ క్రీములు, ఇలాంటి రుగ్మతలకు సంబంధించిన ఉత్పత్తుల మ్యాజిక్ రెమిడీస్ లాంటివి ప్రచారం చేయరాదని ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం మొదటి ఆరోపణలు రుజువైతే ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రూ 10 లక్షల జరిమానా రెండవసారి కూడా రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ 50 లక్షల జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: