నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెలగలగూడెలంలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిపై తల్లి దండ్రులు, అన్న కర్కషంగా ప్రవర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురన్న కనికరం కూడా లేకుండా బండరాళ్లతో మోది చంపేందుకు ప్రయత్నించారు. కడుపున పుట్టిన బిడ్డ అన్న ఆలోచన కూడా లేకుండా హత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెలితే కవిత అనే యువతిపై ఈ రోజు తెల్లవారుజామున హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.


ఈ రోజు ఉదయం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఆ యువతికి పెళ్లిచేసే ఆలోచనలో ఉన్నారు పెద్దలు. అయితే ఆస్తిలో తనకు కూడా వాటా కావాలంటూ యువతి పట్టుపట్టడంతో వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది. గత రాత్రి ఆస్తి విషయంలో గొడవ జరగటంతో యువతి నిద్రించిన తరువాత తల్లి దండ్రులతో పాటు ఆమె అన్న బండరాయితో ఆమె మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది.


దాడి జరగుతున్న సమయంలో ఆ యువతి గట్టిగా కేకలు వేయటంతో చుట్టు పక్కల వారు వచ్చిన తల్లిదండ్రులను ఆపి యువతి ప్రాణాలు రక్షించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన యువతి అపస్మారక స్థితిలోకి వెల్లటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తల్లి, అన్న పరారిలో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.


ఈ విషయం స్థానికుల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అమ్మాయి పెళ్లి చేయాలని చూస్తున్న తల్లి దండ్రులు ఒక్కసారి ఇలా ప్రవర్తించటం ఇరుగు పొరుగు వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కన్నకూతురిపైనే ఇలా కర్కషంగా దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, అసలు కారణాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు పోలీస్‌ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: