బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగ్గొట్టే నేతల జాబితాలో నారా లోకేష్ తోడల్లుడు, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కూడా చేరిపోయారు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఉన్న కరూర్ వైశ్యా బ్యాంకులో ఎప్పుడో వంద కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టారని సమాచారం.  తమ బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు ఎన్నిసార్లు నోటీసులిచ్చిన భరత్ అసలు లెక్కే చేయటం లేదట. దాంతో  బ్యాంకుల్లో అప్పులు చేసి ఎగ్గొట్టిన టిడిపి నేతల జాబితాలో తాజాగా భరత్ కూడా చేరిపోయారు.

 

ఏదో కంపెనీ ఏర్పాటు పేరుతో వైశ్యా బ్యాంకులో భరత్ అప్పు తీసుకున్నాడు. అందుకు గాను విశాఖపట్నం సమీపంలోని భీమిలి, గాజువకా ప్రాంతాల్లో ఉన్న భూములను గ్యారెంటీగా పెట్టారు. అయితే  అప్పు తీర్చకపోవటంతో పాటు వాయిదాలు కూడా కట్టకుండా నిలిపేయటంతో బ్యాంకుకు అనుమానం వచ్చింది. బ్యాంకులో పేరుకుపోయిన అప్పుతో పాటు కట్టాల్సిన బకాయిల విషయమై సమాచారం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ప్రయత్నిస్తే అందుబాటులో లేడట. దాంతో చేసేది లేక నోటీసు ఇచ్చారట బ్యాంకు అధికారులు.

 

నోటీసుకు కూడా సమాధానం ఇవ్వకపోవటంతో వేరే దారి లేక తమ దగ్గరున్న ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తామని చెబుతూ మళ్ళీ నోటీసు ఇచ్చారు. అయినా ఆ నోటిసుకు కూడా సమాధానం రాలేదు.  దాంతో ఫైనల్ నోటీసు పేరుతో బ్యాంకు చివరిసారిగా మళ్ళీ ఓ నోటీసును హైదరాబాద్ లో ఉన్న ఇంటితో పాటు విశాఖపట్నంలోని ఇంటికి కూడా పంపారు. అయినా సమాధానం రాలేదు.

 

దాంతో వాళ్ళకు విషయం అర్ధమైపోయింది. తీసుకున్న అప్పును తీర్చే ఉద్దేశ్యంలో భరత్ లేడని నిర్ధారణ చేసుకున్న బ్యాంకు అధికారులు చివరిసారిగా ప్రయత్నిద్దామని ఆస్తులను వేలం వేయబోతున్నట్లు సమాచారం ఇచ్చారట. మరి  ఈ నోటీసుకైనా భరత్ నుండి సమాధానం వస్తుందేమో చూడాలి. గతంలో ఆంధ్రబ్యాంకు నుండి భరత్ కుటుంబం రూ. 100 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: