తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎంత బోలాగా వరాలు కురపిస్తాడో.. తనతో వైరం పెంచుకుంటే అదే స్థాయిలో ఇబ్బందుల పాలు కూడా చేస్తాడన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే కేసీఆర్‌తో వైరం పెంచుకునేందుకు రాజకీయ ఉద్దండులు కూడా వెనకడుగు వేస్తుంటారు. అదే బాటలో టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేకవర్గమైన ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, రాధకృష్ణ లాంటి వారు కూడా కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూశారు. తెలంగాణ రాష్ట ఏర్పాటు చేసిన ఆంధ్రజ్యోతి కాస్త అత్యుత్సాహం ప్రదర్శించటంతో కేసీఆర్‌ ఆ సంస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు.


రాష్ట్ర ఏర్పాటు తరువాత దాదాపు ఏడాదిన్నర పాటు ఆ పేపర్‌, ఛానల్‌ మీద తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిస్త నిషేదం కొనసాగింది. ఎన్నో న్యాయపోరాటల తరువాత తిరిగి ప్రసారాలు ప్రారంభించిన ఆ సంస్థ, కేసీఆర్‌తో కయ్యం కన్నా వియ్యమే బెటర్‌ అని భావించింది. అందుకే తెలంగాణ ప్రభుత్వ అనుకూల కథనాలతో కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకుంది. కేసీఆర్‌ కూడా ఆంధ్రజ్యోతి సంస్థ కార్యలయంలో అగ్నిప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి హోదాలో అక్కడి వెళ్లారు.


అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితి మళ్లీ తారుమారైంది. ఇన్నాళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఆంధ్రజ్యోతి ఎన్నికల సమయంలో మాత్రం టీడీపీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమికి మద్దుతుగా నిలిచింది. దీంతో కేసీఆర్‌కు మరోసారి చిర్రెత్తుకొచ్చింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయభావుటా ఎగురవేయటంతో ఆంధ్రజ్యోతికి మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రకటన విషయంలో ఆంధ్రజ్యోతికి భారీగా కోత పడింది.


ఈ విషయంపై ఆంధ్రజ్యోతి ప్రెస్‌ కౌన్సిల్‌లోనూ ఫిర్యాదు చేసింది. ప్రకటనలు ఇవ్వటంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని ఆరోపించింది. అందుకు కొన్ని ఆధారాలను కూడా చూపిస్తోంది ఆంధ్రజ్యోతి యాజమాన్యం. ఈ ఫిర్యాదులో నమస్తే తెలంగాణకు భారీగా ప్రకటనలు ఇవ్వడాన్ని కూడా ప్రశ్నించింది. ఏబీసీ సర్టిఫికేట్ లేని నమస్తే తెలంగాణకు దాదాపు 16 కోట్ల రూపాయల ప్రకటనల ఇస్తూ, ఏబీసీ రిపోర్ట్ ప్రకారం మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి 2 కోట్ల మేర ప్రకటనలు ఇవ్వడం అన్నది వివక్షే అని ఆరోపించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: