శాసనమండలిలో రెండు కీలక బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు వైసిపి మండలి ఛైర్మన్ కు రూ. 50 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.  ఛైర్మన్ తో పాటు టిడిపి సభ్యులకు కూడా తలా ఓ రూ. 25 కోట్లు వైసిపి నుండి ఆఫర్ వచ్చిందంటూ ఉమ చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  దేవినేని చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంది అని ఎవరూ ఆలోచించకూడదు. ఎందుకంటే టిడిపి నేతలు చెప్పారంటే అది నిజమే అని అనేసుకోవాలంతా.

 

వైసిపి నుండి భారీగా ఆఫర్లు వచ్చినా ఛైర్మన్ తో పాటు సభ్యులంతా జనాల పక్షానే నిలబడ్డారటని దేవినేని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఓ బిల్లును  మండలి పాస్ చేయించుకునేందుకు వైసిసి అంత భారీ మొత్తంలో ఆఫర్ చేసిందంటే నమ్మేంత పిచ్చోళ్ళెవరూ లేరు. ఎందుకంటే ఇపుడు రెజక్టయిన బిల్లులు మరో నాలుగు నెలల తర్వాత ఎవరికీ రూపాయి కూడా ఇవ్వకుండానే పాసయిపోతాయన్న విషయం అందరికీ తెలుసు. నాలుగు నెలలు ఆగితే సరిపోయేదానికి అధికార పార్టీ వందల కోట్లు ఆఫర్ చేస్తుందా ?

 

ఏమిటో  టిడిపి నేతలకు కనీసం ఇంగితం కూడా లేకుండానే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. ప్రతిరోజు ఏదో ఓ సబ్జెక్టుతో జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. దానికి ఎల్లోమీడియా శక్తివంచన లేకుండా ఆజ్యం పోస్తోంది. అందుకనే  పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రతిరోజు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నంత కాలం ఇలా చవకబారుగా  మాట్లాడే 23 సీట్లకు పరిమితమయ్యారు. అయినా వీళ్ళకు  జ్ఞానోదయం కాలేదు.  ఛైర్మన్ కు 50 కోట్ల ఆఫర్ వచ్చిందని దేవినేని ఆరోపిస్తున్నారు కానీ ఛైర్మన్, సభ్యులెవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతోనే దేవినేని ఆరోపణల్లో ఎంత పసుందో తెలిసిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: