దాదాపు 3 సంవత్సరాల క్రితం నవంబర్ నెలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ ప్రకటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. మోదీ ప్రభుత్వం ఆ తరువాత కొత్త 500 రూపాయల నోట్లు, కొత్త 2,000 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకొచ్చింది. 

 

దీంతో ప్రజలకు 2,000 రూపాయల నోట్లు ఉపయోగించటం సాధారణమైంది. ఏటీఎంలలో కూడా 2,000 రూపాయల నోట్లు ఎక్కువగా వచ్చేవి. కానీ కొన్ని నెలల నుండి 2,000 రూపాయల నోట్లు ఎక్కువగా కనిపించటం లేదు. 500 రూపాయల నోట్లు అందుబాటులో ఎక్కువగా ఉన్నా 2,000 రూపాయల నోట్లు మాత్రం అంతగా కనిపించటం లేదు. మరోవైపు ఆర్బీఐ 2,000 రూపాయల నోట్ల ముద్రణను కొన్ని నెలల నుండి నిలిపివేసింది. 

 

అయితే ఆలా నిలిపివేసిన విషయం మూడు నెలల క్రితం బయటకు రావడంతో అప్పట్లో నోట్ల రద్దు అని ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇప్పుడు మళ్ళి అదే విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫేస్ బుక్ లో ప్రముఖ టెక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అది ఏంటి అంటే.. ''2000 రూపాయల నోట్లు గురించి ఇపుడు అన్ని బ్యాంక్ లకు సమాచారం వస్తోంది. నేను గంట క్రితం రాస్తే ఫేక్ న్యూస్ అన్న కొందరు బ్యాంక్ మేనేజర్ లు ఇప్పుడు అప్రిసియేట్ చేస్తున్నారు నన్ను. 🙂 నేను ఆధారాలు లేనిదే ఎప్పుడూ ఏది రాయను. రేపటి నుండి ఏటీఎం లలో 2000 నోట్లు పెట్టరు. బ్యాంక్ లు కస్టమర్ లకు వాటిని ఇవ్వకూడదు. కేవలం డిపాజిట్ చేయొచ్చు అంతే.'' అంటూ ప్రముఖ టెక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

 

ఏది ఏమైనా.. 2 వేల నోటు రద్దు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే నోట్ల రద్దు జరిగితే.. ఏం అవుతుంది? అందుకే.. ముందు జాగ్రత్త పడి మీరు దాచుకున్న నోట్లను బ్యాంకులో మార్చుకోండి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: