`తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడును కాపీ చేసిన‌ ప‌క్క‌రాష్ట్ర సీఎం` ఇదేదో ఘ‌న‌కార్యం గురించి కాదండి. ప్రజాస్వామ్యం...విలువలు అంటూ చంద్ర‌బాబు ఇచ్చే ఉప‌న్యాసాల‌కు...చేసే ప‌నుల‌కు పొంత‌నే ఉండ‌ద‌నే విష‌యం..ఎన్నో సంద‌ర్భాల్లో...వివిధ విష‌యాల్లో రుజువైంద‌ని విమ‌ర్శ‌కులు...విశ్లేష‌కులు పేర్కొంటుంటారు. అయితే, తాజాగా ఆయ‌న‌కు సంబంధించిన ఈ ల‌క్ష‌ణాన్ని ఓ నాయ‌కుడు కాపీ కొట్టారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు చేసిన ప‌నినే కాపీ కొట్టిన ఆ సీఎం మ‌రెవ‌రో కాదు...క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూరప్ప.

 

 

చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా.... వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలను ఫిరాయించారు. పిరాయింపు సమయంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారు. కొందరికి మంత్రి పదవులు ఆఫర్ చేశారు. అలా మంత్రి పదవుల హామీతో పార్టీలో చేరిన తీరు, ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా..ఆయ‌న ముందుకే సాగారు. జంప్ జిలానీల విష‌యంలో... బాబు ఎదుర్కున్న అలాంటి అప‌ప్ర‌దనే ఇప్పుడు కర్ణాటక సీఎం యెడియూరప్ప అనుభ‌వించాల్సి వ‌స్తోంది. 

 


గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించిన కర్ణాటక సీఎం యెడియూరప్ప రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన జేడీఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన 10 మంది మాజీ ఎమ్మెల్యేలకు (వీరంతా బీజేపీ టికెట్‌పై ఉపఎన్నికల్లో గెలిచారు) క్యాబినెట్‌లో చోటుకల్పించారు.  జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో అనర్హత వేటు పడిన 16 మందిలో 13 మంది గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేయగా 11 మంది గెలిచారు. అందులో పది మందితో గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో మంత్రుల సంఖ్య 28కి చేరింది.చోటుదక్కని మరో రెబల్‌ ఎమ్మెల్యే కే మహేశ్‌కు కీలక బాధ్యత అప్పగిస్తానని యెడియూరప్ప హామీ ఇచ్చినట్లు సమాచారం. జంపింగ్‌ల‌ను ప్రోత్స‌హించ‌డం....ఇలా మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్ట‌డం అనే దోర‌ణి ప్ర‌జాస్వామ్యంపై ఎలాంటి ప్ర‌భావం చూప‌నుందో నాయ‌కుల‌కే తెలియాలి. రాష్ట్రం ఏదైనా, ఇలాంటి పోకడ‌లు స‌రైన‌వి కాద‌నేది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: