ఎవరు మొదలు పెట్టారో తెలియదుగానీ సోషల్ మీడియాలో బెస్ట్ బిర్యానీ ఏది అన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వివాదంలోకి స్వయంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) కూడా ఎంటర్‌ కావటంతో వివాదం మరింత రసవత్తరంగా మారింది. హైదరాబాద్‌ బిర్యానీకి మరే బిర్యానీ దారి దాపుల్లో కూడా ఉందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి.


ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచం అంతా తమ బిర్యానీ హైదరాబాద్‌ బిర్యానీ స్థాయిలో ఉందని కలలు కంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు యునెస్కో కూడా హైదరాబాద్‌కి క్రియేటివ్ సిటీ ఆఫ్‌ గ్యాస్ట్రోనమీ అంటూ కితాబిచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయటం వెనుక పెద్ద కారణమే ఉంది.


ఇటీవల నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ బిర్యానీ గురించి తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ ట్వీట్ చేశాడు. పారీస్‌ రెస్టారెంట్‌లో సర్వ్‌ చేసే థలస్సెరీ ఫిష్ బిర్యానీనే ప్రపంచంలో బెస్ట్ బిర్యానీ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ఆ బిర్యానీ తయారిలో వినియోగించే పదార్థాలను కూడా తన ట్వీట్‌లో ప్రస్థావించాడు అమితాబ్‌. మరో అడుగు ముందుకు వేసి అదో అద్భుతం మరే బిర్యానీ ఈ వంటకానికి దరిదాపుల్లోకి కూడా రాదు. అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.


ఈ ట్వీట్‌ స్పందించిన కేటీఆర్‌ ప్రపంచంలో బెస్ట్ బిర్యానీ హైదరాబాద్‌ బిర్యానీనే అంటూ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. కేటీఆర్‌కు మద్ధతుగా హైదరాబాదీలు, బిర్యానీ ప్రియులు పెద్ద ఎత్తున ట్వీట్‌లు చేస్తున్నారు. కేవలం అన్నంలో చేప వేసి వండితే అది బిర్యానీ కాదంటూ ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రముఖ పాక శాస్త్ర నిపుణులు సంజీవ్ కపూర్‌ గతంలో హైదరాబాద్‌ బిర్యానీకి ప్రపంచ రాజదానీ అంటూ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: