కూతురంటే కూడికలు కూడికలు తీసివేతలు లెక్క కాదు.. కొడుకు లేకపోయినా ఫర్వాలేదు. కానీ కూతురు మాత్రం ఖచ్చితంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. గతంలో ఆడపిల్ల పుడితే పురిట్లోనే చంపేసేవారు అనే కథనాలు మనం చాలానే విన్నాము. కానీ మారుతున్న కాలాన్ని బట్టి కొడుకు కంటే కూతురు ఉంటేనే  మంచిది అన్నట్లుగా అంతా భావిస్తున్నారు. కూతురు చూస్తున్నట్టుగా అమ్మా,నాన్నలను ఎవరు చూడలేరు అనే ఒక అభిప్రాయం వచ్చేసింది. కానీ నల్గొండ జిల్లాలోని ఓ కుటుంబం కన్నకూతుర్ని తమకు భారంగా భావించింది. కూతురికి పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాల్సి వస్తుందని, ఆ కూతురు ని కొట్టి చంపేందుకు కూడా వారు వెనుకాడకపోవడం సంచలనం రేపుతోంది.


 నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు గా ఉన్న కవితను ఆమె తల్లిదండ్రులు అన్నయ్య కలిసి బండరాళ్లతో తీవ్రంగా కొట్టడంతో ఆమె ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పెళ్లి చేస్తే కట్నం ఇవ్వాల్సి వస్తుందని, అలా కాకుండా ఆమెను చంపేస్తే ఆ డబ్బు ఆదా అవుతుందని ఇక ఏ సమస్యలు ఉండవు అని భావించి కూతురిపై వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 


ప్రస్తుతం కవిత పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు కవిత వయస్సు  32 సంవత్సరాలు పీజీ వరకు చదివింది. కానీ ఆమెకు చాలా కాలంగా పెళ్లి సంబంధాలు వస్తున్నా వాయిదా వేస్తూ వస్తున్నారు. దీనిపై కవిత కూడా ఆమె తల్లిదండ్రులను పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే అంటూ అడుగుతూ వుండేది. దీంతో వారు ఆమె మీద ఆగ్రహం పెంచుకున్నారు. 


ఆ కుటుంబానికి చెందిన ఏడెకరాల భూమి రెండెకరాల భూమిలో రెండు ఎకరాల భూమిని తన పేరును రాయాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ వస్తోందని, ఈ వ్యవహారం కొంతకాలం నుంచి సాగుతూ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను చంపేస్తే ఆస్తి కలిసొస్తుందనే దుర్భుద్ధితో ఆమె తల్లి, అన్నయ్య, తండ్రి కలిసి ఆమెను హత్య చేసినట్లుగా వారి మీద అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: