ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలు మొత్తం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల  ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు. అమరావతి కోసం భూముల్ని ఇచ్చిన  తమకు రాజధానిని తరలించి  అన్యాయం చేయొద్దని జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. రైతుల ధర్నా నేపథ్యంలో అమరావతి లో తీవ్ర  ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకుంటాయి. ఇక టిడిపి కూడా అమరావతి రైతుల నిరసన కు మద్దతు తెలుపుతూ వస్తుంది. 

 


 ఇక అమరావతి పరిరక్షణ సమితి పేరిట చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తూ జోలె పట్టి  విరాలాలు సైతం సేకరిస్తున్నారు . ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఢిల్లీలో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు చేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాష్ట్రపతిని కలిసి అమరావతి అంశం గురించి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు తలపెట్టిన రాజధాని తరలింపు పై జోక్యం చేసుకోవాలంటూ అమరావతి పరిరక్షణ నేతలు రాష్ట్రపతిని కోరారు. 

 


 ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపుపై జోక్యం చేసుకొని తరలింపును  నిలిపివేయాలంటూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేఏసీ నేతలు తమ  అభ్యర్థనకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాము అంటూ తెలిపారు. ఇకపోతే ఇప్పటికే 50 రోజులకు పైగా అయినప్పటికీ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు చేపడుతూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. జగన్ సర్కార్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు నిరసనలు ధర్నాలు విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: