సాధారణంగా కప్పలను పాములు తింటాయి. పాములను చూస్తేనే కప్పలు గజగజా వణుకుతూ ఆమడ దూరం పారిపోతాయి. కానీ దీనికి విరుద్ధంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ నగరంలో ఒక కప్ప ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముని వేటాడి మరీ చంపేసింది. ఆ తర్వాత ఆ పాముని నోటిలో వేసుకొని కరకరా నమిలి మింగేసింది. అయితే ప్రస్తుతం ఈ కప్పని నెటిజనులు అంతా కొనియాడుతున్నారు. అస్సలు ఇంతకీ ఈ కప్ప యొక్క కథాకమామిషు ఏంటో ఈ ఆర్టికల్ మనం తెలుసుకుందాం.


వివరాల్లోకి పోతే.. మంగళవారం రోజు క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే లో నివాసముంటున్న ఒక మహిళ.. పాములను పట్టుకునే ఒక సంస్థ యజమాని జామీ చాపెల్‌ కి ఫోను చేసి తన ఇంటి పెరడులో కోస్టల్ తైపాన్‌ పాము ఉందని.. దానిని వెంటనే పట్టుకోమని చెప్పింది. దీంతో జామీ చాపెల్‌ ఆమె ఇంటికి తన సిబ్బందితో పాటు హుటాహుటిన చేరుకున్నాడు. ఆపై ఈ సిబ్బంది ఆమె ఇంటి పెరడులో పాము కోసం వెతుకుతుండగా... వారికి ఒక దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. అదేంటంటే ఆకుపచ్చ కలర్ లో ఉన్న ఒక కప్ప (గ్రీన్ ట్రీ ఫ్రాగ్), కోస్టల్ తైపాన్‌ పాము పోట్లాడుకుంటున్నాయి.



ఈ క్రమంలో విషపూరితమైన కోస్టల్ తైపాన్‌ పాము ఆ కప్పని చాలాసార్లు కాటు వేసింది. కానీ కప్ప మాత్రం చీమ కూడా కుట్టనట్లు ఉండి.. చివరికి పామును చంపేసి నమిలి మింగేసింది. ఈ దృశ్యాలను చూస్తున్న సిబ్బంది కప్ప చనిపోతుందని భావించారు. కానీ ఆ కప్ప పరిస్థితి మాత్రం నార్మల్ గానే కనిపించింది. దీంతో కప్ప చనిపోతుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి... దానిని ఒక ల్యాబ్ కు తీసుకు వెళ్లి పరీక్షించారు. అయితే ఆ కప్ప ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉండి అక్కడ వారందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో టౌన్స్‌విల్లే సిబ్బంది ఈ అరుదయిన విషయాన్ని తమ ఫేసుబుక్ లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు అంతా తెగ ఆశ్చర్యపోతూ లైకులు, షేర్లు చేస్తూ ఈ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: