ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం జాతర. కుంభమేళా తర్వాత ఎక్కువ మొత్తంలో భక్తులు హాజరయ్యే మొక్కులు చెల్లించుకుని జాతర సమ్మక్క సారలమ్మల మేడారం జాతర. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మేడారం మహాజాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి కి ముందు నాలుగు రోజుల పాటు ఈ మహా జాతర జన జాతర జరుగుతుంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కి ఎదురు నిలిచి ప్రాణాలర్పించిన సమ్మక్క సారలమ్మలను గిరిజనులు దేవతలుగా కొలుచుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది గిరిజనులు ఈ గిరిజన జాతర కు చేరుకొని సమ్మక్క-సారలమ్మ లకు మొక్కులు చెల్లించుకుంటారు. కాగా  ఫిబ్రవరి 5 న ఈ మహా జాతర ప్రారంభం కావడంతో మేడారం మొత్తం భక్త జనంతో నిండిపోయింది. కనీసం ఇసుక కూడా రాలనంత జనంతో మేడారం జాతర ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతోంది. 

 

 

 దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులే కాకుండా ఎంతో మంది భక్తులు ఈ మేడారం జాతరకు చేరుకొని సమ్మక్క సారలమ్మలను మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలుసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు మేడారంజాతరకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తాజాగా మేడారం జాతరకు చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం చేరుకున్నారు. వనదేవత లైన సమ్మక్క సారలమ్మ లకు పట్టు వస్త్రాలు సమర్పించి... ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. తెలంగాణ మొత్తం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని... ఎంతగానో అభివృద్ధి చెందాలని సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు తీర్చుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 

 

 

 

 అయితే ఇప్పటికే సమ్మక్క-సారలమ్మల దగ్గరికి లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో భారీ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మక్క సారలమ్మలు దర్శించుకున్నారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు పర్యవేక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదిలా ఉంటే మేడారం జాతరకు భక్తులు భారీగా తరలి రావడంతో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. వైద్యశాలలు ఏర్పాటు చేయడంతోపాటు జాతరలో  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య డ్రోన్ కెమెరా నిఘాలో  సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: