ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా గడగడ వణికిస్తోంది అంటే అది కరోనా వైరసే.. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది. ఒకరికి ఒకరికి వ్యాధి సోకుతూ వ్యాధి భారిన పడి మృతి చెందుతున్నారు. అంతటి మహామ్మారి ఈ కరోనా.. ఇప్పటికే ఈ కరోనా వైరస్ భారిన పడి దాదాపు 1000మందికి పైగా మృతి చెందారు. కొన్ని వేల మంది ఈ వ్యాధి భారిన పడ్డారు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. ఈ కరోనా వైరస్ ని గుర్తించిన వైద్యుడు ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ కన్ను మూసారు. ఇక్కడ విషాదకరమైన విషయం ఏంటంటే .. ఆ వ్యాధి భారిన పడ్డ వైద్యుడు కూడా కరోనా భారిన పడి మృతి చెందినవాడే కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

 

కరోనా వైరస్ చైనాలో వ్యాపిస్తుంది అని.. ప్రపంచాన్ని వణికించే వైరస్ అని వుహాన్ లీ వెన్ లియాంగ్ అనే వైద్యుడు తోటి వైద్యులను హెచ్చరించారు. అయితే లి తన సోషల్ మీడియా వేధికగా ఓ విషయాన్నీ వెల్లడించారు.. అది ఏంటి అంటే.. సీఫుడ్‌ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తమ ఆస్పత్రిలో చేరారని.. వారికీ ప్రత్యేక పరీక్షలు చెయ్యగా వారు సార్స్ బారిన పడ్డారని తెలిసిందని అయన పేర్కొన్నారు. 

 

ఆ వైరస్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తుంది అని 2019 డిసెంబర్ 30న పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్టులపై ఆగ్రహించిన పోలీసులు అతన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయంలోనే అతను కరోనా భారిన పడి జనవరి 12న ఆస్పత్రిలో చేరారు. చివరికి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. అయితే ఆయనను ఇబ్బందులకు గురి చేసిన పోలీసులు చివరికి ఆయనకు క్షమాపణలు చెప్పారు. కాగా కరోనాను కనిపెట్టిన 'వైద్యుడు' కరోనా భారిన పడి మృతి చెందడంతో చైనా దేశ ప్రజలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: