ఒక జంట కొత్తగా పెళ్లి చేసుకుంది. ఆ జంట పెళ్లి రిసెప్షన్ కోసం ఘనంగా ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఆ జంట రిసెప్షన్ కు రావడానికి మాత్రం అంగీకరించలేదు. ఆ జంట రిసెప్షన్ కు రావడానికి అంగీకరించకపోవటానికి కారణం తెలిసి షాక్ అవ్వడం వారి బంధువుల, స్నేహితుల వంతయింది. సింగపూర్ కు చెందిన కాంగ్ టింగ్ ,జోసెఫ్ యూ అనే జంటకు కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. 
 
వివాహం జరిగిన తరువాత ఈ జంట కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవటం కోసం చైనాకు వెళ్లారు. చైనాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని కొన్నిరోజుల పాటు అక్కడే ఉండి ఆ తరువాత సింగపూర్ కు వచ్చారు. ఆ తరువాత కరోనా వైరస్ కు సంబంధించిన వార్తలు వెలుగులోకి రావడంతో ఈ జంట కరోనా వైరస్ తమకు కూడా సోకి ఉంటుందేమో అని భయభ్రాంతులకు గురైంది. 
 
అందువలన ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ జంట రిసెప్షన్ కు హాజరు కావడానికి ఆసక్తి చూపించలేదు. వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు కాకపోయినప్పటికీ తమ కోసం రిసెప్షన్ కు హాజరైన బంధువులను, స్నేహితులను నిరాశ పరచటం ఇష్టం లేని ఆ జంట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతిథులకు ధన్యవాదాలను తెలిపింది. అతిథులు కూడా ఈ జంట తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. 
 
ఈ జంటలో వరుడు సింగపూర్ కు చెందిన వ్యక్తి కాగా వధువు చైనాకు చెందిన యువతి. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉండటంతో వధువు కుటుంబం రిసెప్షన్ వేడుకలకు హాజరు కాలేదు. వధువు కుటుంబం సింగపూర్ రావాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుండి అనుమతి లభించకపోవటంతో వారు అక్కడే ఉండిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు ఆ జంట తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: