సాధారణంగా పాములంటే ఎవరికైనా భయం.  అయితే పాముల్లో సెకన్లలో ప్రాణాలు తీసే విషనాగులు ఉంటాయి.. అస్సలు విషం లేనివి ఉంటాయి.  అయితే ఏ పామును చూసిన మనిషికి గుండె గుభేల్ మనడం ఖాయం.  ఇక నాగుపాములను చూస్తే సగం ప్రాణాలు పోయినంత పని అవుతుంది.  కాకపోతే కొంత మంది పాములతో చాలా సునాయాసంగా ఆడుకుంటుంటారు.. వాటిని పట్టడంలో మంచి నైపుణ్యం సంపాదిస్తుంటారు.  కొన్ని సందర్భాల్లో వాటి కాటుకు బలైపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.  మనిషి పాము అంటే ఎంతగా భయపడతారో.. అంతే భక్తి విశ్వాసాలు చూపిస్తుంటారు.  భారత దేశంలో పాములకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. నాగదేవతగా, నాగరాజుగా కొలుచుకుంటారు.  ప్రతి దేవాలయం ముందు ఖచ్చితంగా నాగదేవత గుడి ఉండటం గమనార్హం. 

 

ఎంతో మంది తమ పిల్లల పేర్లు నాగు అని పెట్టుకుంటారు.  ఇక సినిమాల విషయానికి వస్తే అన్ని భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు.  ఇదిలా ఉంటే ఓ యాంకర్ తన మెడలో నాగు పాము వేసుకొని భయం భయంగా రిపోర్టింగ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ మహిళా రిపోర్టర్ పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ  ఓ ప్రోగ్రాంలో పాల్గొంది. అంతా బాగుంది కానీ.. ఆమె రిపోర్ట్ చేసే సమయంలో పాము బుసలు కొట్టడంతో పై ప్రాణాలు పైకే పోయినంతగా భయం భయంగా రిపోర్టింగ్ చేసింది.

 

పాము బుసలు కొట్టడంతో ఆమె భయంతో గజ గజా వణికిపోయింది.. మూడు సార్లు ఇలా జరిగింది. ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా రిపోర్టర్ పట్టుకున్న మైకుపై ఆ పాము కాటు వేసినంత పని చేసింది.  'మైకు దగ్గరలోనే నా చేయి ఉంది. దీంతో నేను చాలా భయపడి పోయాను' అని ఛానల్ 9 మహిళా జర్నలిస్టు తెలిపింది. అయితే నెటిజన్లు ఇలాంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తే పాము కాటుకి గురి అయితే ఏంటీ పరిస్థితి అని అడుగుతున్నారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: