ప్రస్తుతం భారతదేశంలో క్రికెట్ ను ఆరాధించే ప్రేక్షకులు ఎంతో మంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియా ఏ జట్టు తో క్రికెట్ ఆడిన భారత ప్రేక్షకులందరూ ఎంతగానో ఆసక్తిగా మ్యాచ్ ను  వీక్షిస్తూ ఉంటారు. అయితే భారత జట్టు ఏ జుట్టు తో ఆడిన రాని   మజా  పాకిస్తాన్ తో మ్యాచ్  ఆడినప్పుడు వస్తుంది. భారత్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగితే... కళ్ళార్పకుండా  క్రికెట్ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తుంటారు. అయితే సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ల క్రితం ఇదే రోజున భారత పాకిస్తాన్ మ్యాచ్ లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం రండి. భారత క్రికెట్కు వన్నెతెచ్చిన ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే ముందు వరుసలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తనదైన స్టైల్ తో లెగ్ బ్రేక్  ప్రత్యర్థుల గుండెల్లో పరుగులు పెట్టిస్తు వికెట్లు పడగొట్టిన ఘనత  అనిల్ కుంబ్లే సొంతం. భారత జట్టుకు ఎన్నో సంవత్సరాల పాటు ఎనలేని సేవలందించారు. 

 

 

 భారత క్రికెట్ దిగ్గజం అయిన అనిల్ కుంబ్లే సరిగ్గా 21ఏళ్ళ క్రితం ఫిబ్రవరి 7 అంటే ఇదే రోజున ఓకే ఇన్నింగ్స్ లో  10 వికెట్లు తన ఖాతాలో వేసుకుని సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇది కూడా భారత దాయాది జట్టు అయిన పాకిస్తాన్ పై. ఇప్పటికీ అనిల్ కుంబ్లే రికార్డును  ఎవరు చేరుకోలేకపోయారు.1999 జనవరి లో  భారత్ పర్యటనకు పాకిస్తాన్ వచ్చింది. కాగా రెండు టెస్టుల్లో ఘోర ఓటమి చవి చూస్తుంది పాకిస్తాన్ జట్టు. ఈ సందర్భంగా జరిగిన రెండో ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 420 పరుగుల ను పాకిస్తాన్ ముందు ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చి 101 పరుగులు చేశారు. ఇంతలో అనిల్ కుంబ్లే తన లెగ్ బ్రేక్ తో వికెట్ల  ప్రవాహాన్ని మొదలుపెట్టాడు. తన లెగ్ బ్రేక్ తో తొలి వికెట్గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం అయిన షాహిద్ ఆఫ్రిది  బౌల్డ్ చేసి తన వేట ప్రారంభించాడు అనిల్ కుంబ్లే. ఆ తర్వాత వరుసగా పాకిస్తాన్ బ్యాట్ మెన్స్ పెవిలియన్   బాట పట్టారు. 

 

 

 అనిల్ కుంబ్లే వేసిన బంతిని టచ్ చేయకుండానే బోల్డ్ అయిన  ఆటగాళ్లు కొందరైతే... టచ్ చేసి క్యాచ్ ఇచ్చి అవుటయినా  ఆటగాళ్లు ఇంకొంతమంది..  భారీ షాట్ ఆడదామని ఎల్బీ  అవుటయ్యారు మరికొంతమంది.. ఇలా వరుసగా వికెట్లు  సాధించిన అనిల్ కుంబ్లే ఏకంగా ఒకటే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టాడు. కేవలం పాకిస్తాన్ 207 పరుగులకే పరిమితం చేయడంతో. ఆ మ్యాచ్లో టీమ్ ఇండియా 212 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా  ఒక ఇన్నింగ్స్లో పది వికెట్లు పడకొట్టిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే  సంచలన రికార్డు నమోదు చేశారు.కాగా ఇప్పటికి  అనిల్ కుంబ్లే రికార్డు అలాగే పదిలంగా ఉంది. క్రికెట్ లో ఎంతోమంది ఆటగాళ్లు వస్తున్నప్పటికీ అనిల్ కుంబ్లే రికార్డును మాత్రం బ్రేక్  చేయలేక పోతున్నారు. అనిల్ కుంబ్లే కి ముందు 1956లో జిమ్ లేకర్ ఈ రికార్డును సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: