శ్రీ భరత్ ...! ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీలో తన హవా చూపించేందుకు ప్రయత్నిస్తున్న యువ నాయకుడు. లోకేష్ తోడల్లుడు హోదాలో విశాఖ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన శ్రీ భరత్ పార్టీలో లోకేష్ స్థాయిలో హవా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనికి తన మావ బాలయ్య అండదండలు కూడా తోడవ్వడంతో ఉత్తరాంధ్ర లో ముందుగా పట్టు సాధించి ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో టీడీపీ లో పదవి పొందాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భావగంగానే టీడీపీలో తనకు భవిష్యత్తులో ఎవరూ పోటీ రాకుండా చేసుకోవడమే కాకుండా ... అధినేత చంద్రబాబు ఆశీస్సులు కూడా పొందేందుకు కొద్ది నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.


 అసలు టీడీపీకి ఎన్టీఆర్ అవసరమే లేదని, రాదు అంటూ ఓ టీవీ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. దీనిపై టీడీపీలోనే ఒక వర్గం భరత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అప్పట్లో బాలయ్య, చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అది ఆ తరువాత సర్దుమణిగింది. ఇది ఇలా ఉండగానే అమరావతి భూ వ్యవహారాల్లోనూ శ్రీ భరత్ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం చాలా రోజులు నడిచింది. ఈ వ్యవహారం సర్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు బ్యాంకులు జప్తు నోటీసులు ఇవ్వడం... ఆస్తులు జప్తు చేస్తామంటూ హడావుడి చేయడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి. 


ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. బ్యానుకలకు ఎగ్గొట్టిన సొమ్ములు సుమారు 124 కోట్ల వరకు ఉండడం వాటిని తక్షణం కట్టకపోతే జప్తు చేసేందుకు కూడా వెనకాడకుండా బ్యాంక్ అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంతో బాలయ్య అల్లుడిలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అంటూ అందరూ ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: