తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానంద స్వామి కి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎంతగా గౌరవం ఇస్తారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  తెలుగు రాష్ట్రా అభివృద్ది కాంక్షిస్తు స్వరూపానంద స్వామి ఎన్నోయాగాలు కూడా చేస్తున్నారు.  అలాంటి స్వరూపానంద స్వామి కి గుంటూరు జిల్లాలోని గోరంట్లలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన ఆయనకు నిరసన సెగ తగిలి ఛేదు అనుభవం మిగిలింది. గుంటూరు జిల్లాలోని గోరంట్లలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన స్వరూపానందేంద్ర స్వామిని అమరావతి రైతులు అడ్డుకున్నారు.  కొంత మంది మహిళలు, పురుషులు ఆయన కారును అడ్డగించి అమరావతికి అన్యాయం జరుగుతుందని.. దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఏంత వరకు న్యాయం అయిన ఆయన్ని నిలదీశారు.  

 

జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అయితే, ఈ సందర్భంగా కొందరు వైసీపీ నాయకులు  అనంతరం మహిళలను అడ్డుకున్న ఆయన శిష్యులు స్వరూపానందేంద్ర స్వామిని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే   అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ గత 50 రోజులకు పైగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. మందడం, వెలగపూడి ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాగా,  గతంలో యాగాలు చేసి జగన్‌ను గెలిపించారని వారు అన్నారు. అమరావతిలో రాజధానిని కొనసాగించేలా యాగం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అమరావతి కోసం కోసం స్వరూపానంద పూజలు చేశారని, మరిప్పుడెందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. 

 

గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి భూములు తీసుకొని అమరావతి రాజధాని ఏర్పాటు చేసి అభివృద్ది చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు ఏపిలో వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  కాగా, ఇక్కడ భూములు కట్టడాలకు ఇబ్బంది అవుతుందని.. గత ప్రభుత్వ నేతలు రైతులను మోసం చేసి భూములు తీసుకొందని.. వారికి కల్లబొల్లి మాటలు చెప్పి అడ్డగోలిగా భూములు తీసుకొని అన్యాక్రాంతం చేశారని అధికార పార్టీ ఆరోపిస్తుంది.  రాష్ట్రం అభివృద్ది చెందాలంటే మూడు రాజధానులు ఉండాలని సీఎం జగన్ అభిప్రాయ పడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమరావతిలో నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: